RRR: రాజమౌళి పేరు మార్చిన డైరెక్టర్ శంకర్.. కేజీఎఫ్ డైరెక్టర్ అలా.. టాలీవుడ్ ప్రముఖులు ఇలా!

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్.. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కిన చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి రూపకల్పనలో బిగ్ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఎన్నో అంచనాలు ఏర్పరచుకుని శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఈ చిత్రాన్ని సామాన్యులే కాదు.. సెలెబ్రిటీలు సైతం వీక్షిస్తున్నారు. ఇలా RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్‌కు చెందిన డైరెక్టర్లు చూసేశారు. ఈ నేపథ్యంలో వాళ్లంతా దీనిపై ఎలాంటి కామెంట్లు చేస్తున్నారో మీరూ చూడండి!

అంచనాలను అందుకున్నారు

అంచనాలను అందుకున్నారు

శుక్రవారమే విడుదలైన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీపై టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో 'రాజమౌళి అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనికి రామ్, భీమ్ పాత్రలు చేసిన ఎన్టీఆర్, చరణ్ నటన తోడైంది. కీరవాణి సంగీతం, సెంథిల్ సినిమాటోగ్రఫి, యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతం' అని పేర్కొన్నాడు.

రాజమౌళి ఊహకు హద్దు లేదు

రాజమౌళి ఊహకు హద్దు లేదు

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాను వీక్షించిన తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'రాజమౌళి సృజనాత్మకతకు హద్దు లేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన అసాధారణంగా ఉంది. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతం. మొత్తం సినిమా సూపర్' అని చెప్పుకొచ్చారు.

మీకు నేను ఏకలవ్య శిష్యుడిని

మీకు నేను ఏకలవ్య శిష్యుడిని

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు. 'ఏకలవ్య శిష్యుడిగా మీ క్రాఫ్ట్ గురించి ఎన్ని సార్లు నేర్చుకున్నా అన్నది పక్కన పెడితే.. మీరు ఎప్పుడూ మీ పనితీరుతో నన్ను ఆశ్చర్యపరుస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ నటన అద్భుతం' అంటూ అందులో పేర్కొన్నాడు.

 మాస్టర్ క్రాఫ్ట్‌మ్యాన్ రాజమౌళి

మాస్టర్ క్రాఫ్ట్‌మ్యాన్ రాజమౌళి

ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీపై దర్శకుడు బాబీ కూడా ట్వీట్ చేశాడు. అందులో 'మాస్టర్ క్రాఫ్ట్‌మ్యాన్ రాజమౌళి గారి నుంచి వచ్చిన మాస్టర్ పీస్ ఇది. ఎన్టీఆర్, చరణ్ నటన అద్భుతం. నటన, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు అన్ని క్రాఫ్ట్ అదిరిపోయాయి. అందరికీ కంగ్రాట్స్' అంటూ వెల్లడించాడు.

ఆర్ఆర్ఆర్ టీమ్‌కు హ్యాట్సాఫ్

ఆర్ఆర్ఆర్ టీమ్‌కు హ్యాట్సాఫ్

ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ముందే భారీ బజ్‌ను ఏర్పరచుకున్న RRR (రౌద్రం రణం రుధిరం) మూవీపై కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'రాజమౌళి సార్.. భావోద్వేగాలతో కూడిన మాస్ మూవీ నచ్చింది. ఎన్టీఆర్ సార్ నా హృదయాన్ని తాకారు. చరణ్ సార్ గూస్‌బమ్స్ తెప్పించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి' అంటూ రాసుకొచ్చాడు.

 రాజమౌళి నుంచి ఆశించలేం

రాజమౌళి నుంచి ఆశించలేం

విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని ప్రశంసిస్తూ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు. 'ఆర్ఆర్ఆర్ మూవీ ఘన విజయం సాధించినందుకు చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్. ఎన్టీఆర్, చరణ్ నటన అద్భుతం. రాజమౌళి సార్ ఈ రేంజ్ సినిమాను అందించడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు' అని చెప్పాడు.

రాజమౌళి పేరు మార్చిన శంకర్

రాజమౌళి పేరు మార్చిన శంకర్

భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీపై దిగ్గజ దర్శకుడు శంకర్ ట్వీట్ చేశారు. అందులో 'అసాధారమైన అనుభవాన్ని అందించిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్, హృదయాలను తాకేలా ఎన్టీఆర్ నటించారు. మా అంచనాలను నిలబెట్టిన 'మహా రాజ'మౌళికి అభినందనలు' అంటూ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X