‘సాహో’ యాక్షన్ పోస్టర్ అదుర్స్... కానీ ఎక్కడి నుంచి లేపారో తెలుసా?
ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సాహో'. ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. యూవి క్రియేషన్స్ వారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా సినిమాకు సంబంధించిన ఓ న్యూ పోస్టర్ విడుదల చేశారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ శత్రువులతో గన్ ఫైట్ చేస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్... సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో స్పష్టం చేస్తోంది. దీన్ని శ్రద్ధా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేస్తూ... 'గతంలో ఎన్నడూ చూడని ఉత్కంఠ రేపే యాక్షన్ సన్నివేశాలతో ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'సాహో' ఈ ఆగస్టు 30 మీ ముందుకు రాబోతోంది' అంటూ క్యాప్షన్ పెట్టారు.

అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన
ఈ పోస్టర్‌కు ప్రభాస్, శ్రద్ధా కపూర్ అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రొమాంటిక్ సీన్ల విషయంలో మాత్రమే కాదు, యాక్షన్ సన్నివేశాల్లో సైతం మీ జంట బావుంది అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.

దాన్ని చూసి ఈ పోస్టర్ డిజైన్ చేశారా?
అయితే ఈ పోస్టర్ చూసిన చాలా మంది నెటిజన్లు... ఇది ఆన్ లైన్ వీడియోగేమ్ టామ్ క్లాన్సీస్ రోయిన్‌బో సిక్స్ సీజ్ పోస్టర్‌ను పోలి ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీన్ని మరీ అంత బూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు ఫ్యాన్స్.

సినిమా ఆలస్యానికి కారణం అదే
‘సాహో' మూవీ ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్లే రిలీజ్ డేట్ వాయిదా వేశారట. క్లైమాక్స్ ఫైట్ సీన్ విజువల్ ఎఫెక్ట్స్ అంతగా బాగోకపోవడంతో వాటిని మళ్లీ చేస్తున్నారని, అందుకే ఆలస్యం అవుతోందని సమాచారం.

సాహో
'సాహో' చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఎవలీన్ శర్మ లాంటి బాలీవుడ్ తారలు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన యాక్షన్ సినిమాలు అన్నింటినీ మించి పోయేలా ఈ చిత్రం ఉంటుందట.


Click it and Unblock the Notifications











