గుట్టుచప్పుడు కాకుండా సాహో డైరెక్టర్ పెళ్లి.. ప్రభాస్ వచ్చాడా లేదా? అంటే.. వైరల్‌గా ఫోటోలు
మొత్తానికి సాహో దర్శకుడు సుజిత్ కూడా ఒక ఇంటివాడయ్యాడు. రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన సుజిత్ మొదటి సినిమాతోనే తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. ఇక అంతకుముందే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన క్రేజ్ ని మరింత పెంచుకున్న విషయం తెలిసిందే. ఇక గత కొన్నేళ్ళుగా ప్రేమలో ఉన్న సుజిత్ ఫైనల్ గా సరైన వయసులోనే పెళ్లి చేసుకున్నాడు.

అతికొద్ది మంది అతిధుల సమక్షంలోనే
ఆదివారం సాయత్రం కేవలం అతికొద్ది మంది అతిధుల సమక్షంలోనే సుజిత్ తన ప్రేయసి ప్రవళిక మెడలో మూడు ముళ్ళు వేశాడు. 29 ఏళ్ల సుజిత్ గత ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ సాహో సినిమా ఆలస్యం అవ్వడం వల్ల వాయిదా వేసుకున్నాడు. ఇక జూన్ 10న ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకోబోతున్నట్లు క్లారీటి ఇచ్చేశాడు.

గ్రాండ్ గా చేసుకోవాలని అనుకున్నాడు.
అసలైతే సుజిత్ తన పెళ్లిని గ్రాండ్ గా చేసుకోవాలని అనుకున్నాడు. సినిమా ఇండస్ట్రీ ప్రముఖులను అలాగే ప్రభాస్ వంటి స్టార్ హీరోను తన పెళ్లిలో ప్రత్యేక అతిథిగా చూడాలని అనుకున్నాడు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆడంబరాలను చాలా వరకు దూరం పెట్టిన సుజిత్ సింపుల్ గా తక్కువ మంది కుటుంభ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి ఫోటోస్ వైరల్
ప్రస్తుతం సుజిత్ ప్రవళికల పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రేడిషినల్ లుక్ లో సుజిత్ కుర్తా పజమాతో పెళ్లి పీటల మీద నవ్వుతూ కనిపించాడు. ఇక పెళ్లి కూతురు ప్రవళిక పింక్ సిల్క్ సారితో సిగ్గుపడుతూ కనిపించింది. ముచ్చటైన ఈ యువ జంటకు సినిమా ఇండస్ట్రీ నుంచి వెడ్డింగ్ విషెస్ అందుతున్నాయి.

ప్రభాస్ వచ్చాడా లేదా
ఇక వేడుకకు పెద్దగా అతిధులు ఎవరు రాలేదని తెలుస్తోంది. కేవలం సుజిత్, ప్రవళిక లకు సంబంధించిన కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే వేడుకలో పాల్గొన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు పెళ్లికి హాజరయ్యారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యాంగా ప్రభాస్ వచ్చాడా లేదా అనే విషయంపై కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు.
Recommended Video

నెక్స్ట్ గోపిచంద్ సినిమాతో బిజీ..
కరోనా వైరస్ కారణంగా సింపుల్ గా పెళ్లి చేసుకున్న డైరెక్టర్ సుజిత్ ఇక నెక్స్ట్ రెగ్యులర్ సినిమాలతో బిజీ కానున్నాడు. అసలైతే మెగాస్టార్ తో లూసిఫర్ రీమేక్ చేయాలని అనుకున్నప్పటికి వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. ఇక ఫైనల్ గా సుజిత్ నెక్స్ట్ యూవీ క్రియేషన్స్ లోనే మాస్ హీరో గోపిచంద్ తో ఒక సినిమాను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











