twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరాపై సాహో దెబ్బ.. సందిగ్ధంలో రాంచరణ్, విరుద్ధంగా మెగాస్టార్

    |

    బాహుబలి తర్వాత యంగ్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసింది. రిలీజ్ తర్వాత కూడా హాలీడేస్‌ను క్యాష్ చేసుకొంటూ రికార్డు వసూళ్లను సాధించింది. అయితే దేశవ్యాప్తంగా రికార్డులు తిరగరాసిన సాహో ఓవర్సీస్ మార్కెట్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే సాహో ప్రభావం సైరా చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్‌పై పడుతుందా అనే ఆందోళన ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. వివరాల్లోకి వెళితే..

    సాహో 5 రోజుల కలెక్షన్లు

    సాహో 5 రోజుల కలెక్షన్లు

    సాహో చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ సంఖ్యలో రిలీజైంది. అడ్వాన్స్ బుకింగ్ కూడా రికార్డు స్థాయిలో నమోదైంది. అయితే తొలి ఆట నుంచి నెగిటివ్ రావడంతో కలెక్షన్లు పుంజుకోలేకపోయాయి. గత 5 రోజుల్లో యూఎస్ బాక్సాఫీస్ వద్ద కేవలం 3 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. దాంతో ట్రేడ్ వర్గాల్లో ఓ రకమైన నిరాశ నెలకొన్నది.

    పెద్ద హీరోల సినిమాలపై వెనుకంజ

    పెద్ద హీరోల సినిమాలపై వెనుకంజ

    ఇక భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి ముందుకు రావడం లేదనేది సమాచారం. గత కొద్దికాలంగా స్టార్ హీరోల సినిమాలు పెద్దగా ఓవర్సీస్ మార్కెట్‌లో సందడి చేసిన దాఖలాలు లేవు. దాంతో నిర్మాతలు చెప్పే రేటు పెట్టి కొనడానికి ముందుకు రావడానికి సిద్ధంగా లేరనేది సినీ వర్గాల వాదన.

    సైరా రిలీజ్‌కు సిద్దం

    సైరా రిలీజ్‌కు సిద్దం

    సాహో తర్వాత ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్న చిత్రం సైరా. సాహో మిగిల్చిన చేదు అనుభవంతో ఓవర్సీస్ మార్కెట్‌లో సంతృప్తికరంగా బిజినెస్ జరుగలేదని వార్త సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. సుమారు 300 కోట్ల వ్యయంతో తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ కిచ్చ, రవి కిషన్ లాంటి సీనియర్ నటులు నటించడంతో సైరా ప్యాన్ ఇండియా మూవీగా మారింది.

    ఓవర్సీస్‌లో చిరు సినిమా

    ఓవర్సీస్‌లో చిరు సినిమా

    పదేళ్ల పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం యూఎస్‌లో 2.4 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. తాజాగా సైరాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే రాంచరణ్ ఈ సినిమా బిజినెస్ విషయంలో ఇంకా చర్చల దశలోనే ఉన్నారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

     మెగాస్టార్ డబ్బింగ్ జోష్

    మెగాస్టార్ డబ్బింగ్ జోష్

    ప్రస్తుతం సైరా చిత్రం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఇటీవల డబ్బింగ్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. తాజాగా చిరంజీవి తన డబ్బింగ్ పార్ట్‌ను రికార్డుస్థాయిలో కేవలం 20 గంటల్లోనే పూర్తి చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. డబ్బింగ్ విషయంలో చిరంజీవి చూపిన శ్రద్ద ప్రత్యేకంగా మారింది.

    English summary
    Saaho movie is not impressed at overseas market. Now, it become effect for Saaho. Traders not coming forward for business of sye raa. This movie set to release on October 2nd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X