‘సాహో’ హిందీలో దుమ్మురేపుతోంది, 3వ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్
Recommended Video
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఇండియాలోనే బిగ్ బడ్జెట్ యాక్షన్ మూవీగా యువి క్రియేషన్స్ వారు రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 30న విడుదలై వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది.
తెలుగు కంటే హిందీలోనే 'సాహో'కు అద్భుతమైన వసూళ్లు వస్తుండటం గమనార్హం. ఇక్కడ ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలు వచ్చినా ఆ ప్రభావం వసూళ్లపై ఏ మాత్రం పడలేదు. నార్త్ ఇండియాలో ప్రభాస్ క్రేజ్ ఓ రేంజిలో పెరిగింది అనడానికి ఇదొక నిర్శనం.

బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది
‘సాహో' మూవీ తాజాగా బాక్సాఫీస్ వద్ద థర్డ్ వీకెండ్ పూర్తి చేసుకుంది. రూ. 150 కోట్ల మార్కును అధిగమించింది. సినిమాపై క్రిటిక్స్ నంచి పూర్తిగా ప్రతికూలమైన రివ్యూలు వచ్చినప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ సినిమాల విషయంలోనే ఇలాంటి మ్యాజిక్ జరిగేది. ఇపుడు ప్రభాస్ సినిమాల విషయంలోనూ ఇలాగే జరుగడంతో బాలీవుడ్‌కు మరో సల్మాన్ ఖాన్ దొరికాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రూ. 153 కోట్లకు చేరిన వసూళ్లు
ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా వెల్లడించిన వివరాల ప్రకారం ‘సాహో' మూవీ హిందీ వెర్షన్ 3వ వారంతం నాటికి రూ. 153 కోట్లు(నెట్) వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ప్రభాస్ క్రేజ్ బాగా పెరిగింది
బాహుబలి, బాహుబలి 2 చిత్రాల ద్వారా ప్రభాస్ ఆల్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో మంది అభిమానులను ఏర్పరుచుకున్నారు. ఆ క్రేజే ‘సాహో' విషయంలో బాగా తోడ్పడింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే వసూళ్లు మరో రేంజిలో ఉండేవి అని విశ్లేషకులు అంటున్నారు.

వరల్డ్ వైడ్ కలెక్షన్
‘సాహో' మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్లకుపైగా రాబట్టింది. ఈ చిత్రం రూ. 500 కోట్లను అందుకుంటుందా? లేదా? అనేది చర్చనీయాంశం అయింది. ఈ భారీ బడ్జెట్ మూవీ వల్ల లాభాలు రాకపోయినా... కొంపలు మునిగే స్థాయిలో నష్టాలు అయితే లేవని అంటున్నారు.

ప్రభాస్ తర్వాతి సినిమా
ప్రభాస్ తన తర్వాతి చిత్రం ‘జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నారు. ‘సాహో' స్థాయిలో కాకపోయినా ఈ మూవీ కూడా ప్యాన్ ఇండియా వైడ్ విడుదలయ్యే భారీ చిత్రమే. అయితే ఈ సారి కథ విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టారట.


Click it and Unblock the Notifications











