twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియన్ హై బడ్జెట్ మూవీస్... ‘సాహో’ ఏ స్థానంలో ఉందంటే..?

    |

    ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'సాహో'. ఈ సినిమా కోసం రూ. 350 కోట్లు ఖర్చు పెట్టారు. ఇండియాలో ఇప్పటి వచ్చిన చిత్రాల్లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ రజనీకాంత్ 2.0. దీని కోసం రూ. 570 కోట్లు ఖర్చు చేశారు. రాజమౌళి తీస్తున్న RRR చిత్రానికి రూ. 400 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు నిర్మాత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లెక్కల ప్రకారం చూస్తే రూ. 350 కోట్ల బడ్జెడ్‌తో తెరకెక్కిన 'సాహో' భారత దేశపు 3వ అతిపెద్ద బడ్జెట్ మూవీ.

    యాక్షన్ సీక్వెన్స్‌లో సాహో రికార్డ్

    యాక్షన్ సీక్వెన్స్‌లో సాహో రికార్డ్

    ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ఎక్కువ ఖర్చుతో రూపొందించిన యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఇందులో క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం రూ. 90 కోట్లు ఖర్చుపెట్టారు. మరో ఫైట్ సీన్ కోసం రూ. 16 కోట్లు పెట్టారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదొక రికార్డ్. పెర్ల్ హార్బర్, ట్రాన్స్ఫార్మర్స్: డార్క్ ఆఫ్ ది మూన్, మిషన్ ఇంపాజిబుల్ - ఘోస్ట్ ప్రోటోకాల్ చిత్రాలకు పనిచేసిన ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు.

    భారీ బడ్జెట్ చిత్రాలన్నీ సౌత్ నుంచే..

    భారీ బడ్జెట్ చిత్రాలన్నీ సౌత్ నుంచే..

    మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే భారీ బడ్జెట్ చిత్రాలు తీయడంలో బాలీవుడ్ కంటే సౌతిండియాలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలే ముందున్నాయి. బడ్జెట్ పరంగా చూసుకుంటే ‘సాహో' తరువాతి స్థానంలో విక్రమ్ హీరోగా రూపొందుతున్న ‘మహావీర్ కర్ణ' ఉంది. 2020లో రాబోతున్న ఈ చిత్రానికి రూ. 300 కోట్ల బడ్జెట్‌ ఖర్చు పెడుతున్నారు.

    5వ స్థానంలో సైరా

    5వ స్థానంలో సైరా

    భారీ బడ్జెట్ చిత్రాల జాబితాలో 5వ స్థానంలో ఉన్న చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి'. చిరంజీవి హీరోగా రూపొందిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ కోసం రూ. 270 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

    బాహుబలి 2 పొజిషన్ ఎంతంటే

    బాహుబలి 2 పొజిషన్ ఎంతంటే

    భారతీయ సినీ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ చిత్రంగా కీర్తికెక్కిన ‘బాహుబలి 2' చిత్రం బడ్జెట్ పరంగా 6వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి రూ. 250 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు. ఈ జాబితాలో 7వ స్థానం సంపాదించుకుంది హిందీ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్'. దీని కోసం దాదాపు రూ. 220 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా.

    టాప్ 10లో ఈ సినిమాలు కూడా

    టాప్ 10లో ఈ సినిమాలు కూడా

    సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘పద్మావత్' రూ. 215 కోట్లతో 8వ స్థానంలో, సల్మాన్ ఖాన్ మూవీ ‘టైగర్ జిందా హై' రూ. 210 కోట్లతో 9వ స్థానంలో ఉంది. 10 స్థానంలో షారూఖ్ ఖాన్ ‘జీరో', కమల్ హాసన్ ప్రస్తుతం చేస్తున్న ‘ఇండియన్ 2' చిత్రాలు ఉన్నాయి. వీటి బడ్జెట్ రూ. 200 కోట్లు.

    English summary
    Prabhas Movie Saaho is slated for release on August 30. Saaho is the 3rd highest-budget film in the Indian film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X