‘సాహో’... లక్షలు ఖర్చుపెట్టి వాళ్ల ట్యూన్ తీసుకుంటున్నారా?
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'సాహో' ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి. గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఈమూవీని ఆగస్టు 15న విడుదల చేసేందకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రిలీజ్ ముందు మ్యూజిక్ డైరెక్టర్ తప్పుకున్న వార్త వెలుగులోకి రావడం చర్చనీయాంశం అయింది.
ఈ చిత్రానికి మ్యూజిక్ అందించేందుకు సంగీత త్రయం శంకర్-ఎస్సాన్-లాయ్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇతరులతో కూడా నిర్మాతలు అదనపు పాటలు కంపోజ్ చేయిస్తుండటంతో వీరు నిర్మాతలతో శంకర్-ఎస్సాన్-లాయ్ విబేధించారు. 'సాహో' మ్యూజిక్ క్రెడిట్ ఇతరులతో పంచుకోవడం ఇష్టం లేకనే తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

లక్షలు ఖర్చుపెట్టి వాళ్ల ట్యూన్ తీసుకుంటున్నారా?
తాజాగా ‘సాహో' గురించి ఓ ఆసక్తికర న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. లక్షలు ఖర్చు పెట్టి హాలీవుడ్ నుంచి ఓ ట్యూన్ అరువు తీసుకుంటున్నారట. త్వరలోనే విడుదల కాబోతున్న ‘సాహో' టీజర్ కోసం ఈ ట్యూన్ వాడబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను రాయల్టీగా రూ. 15 లక్షలు సదరు హాలీవుడ్ కంపోజర్‌కు చెల్లించబోతున్నట్లు సమాచారం.

ఇంతకీ మ్యూజిక్ అందించేది ఎవరు?
ఇటీవల విడుదలైన అఫీషియల్ పోస్టర్లో ‘సాహో'కు మ్యూజిక్ అందించేది ఎవరు? అనే వివరాలు లేవు. శంకర్-ఎస్సాన్-లాయ్ తప్పుకోవడంతో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించేది ఎవరు? అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. సినిమా ప్రమోషన్స్ మొదలైన తర్వాత ఒక్కో పాట విడుదల చేస్తూ సంగీతం అందించిన వారి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

హై ఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ
‘సాహో' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తెరకెక్కిస్తోంది. బడ్జెట్లో ఎక్కువ శాతం(రూ. 90 కోట్లు) యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసమే ఖర్చు చేశారు. అబుదాబిలో 60 రోజుల పాటు చిత్రీకరించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికే హైలెట్ కాబోతోంది. ‘షేడ్స్ ఆఫ్ సాహో' పేరుతో చాప్టర్ 1, చాప్టర్ 2 మేకింగ్ వీడియోలు విడుదల చేయగా... అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

సాహో
‘సాహో' చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











