ప్రభాస్ బర్త్ డే స్పెషల్: ఫ్యాన్స్‌కు సాహో యూనిట్ షాకింగ్ ట్రీట్.. అదేమిటో తెలుసా?

బాహుబలి2 తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ప్రత్యక్షంగా పలకరించిన దాఖలాలు లేవు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సాహో మూవీ షూటింగ్ సుదీర్గంగా కొనసాగడంతో ఏడాదిన్నరకుపైగా ప్రభాస్ సినిమా థియేటర్‌కు రాలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి లోనవుతున్నారు. అందుచేత అభిమానుల్లో జోష్ నింపడానికి సాహో యూనిట్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏమిటంటే..

39వ బర్త్ డే నాడు

39వ బర్త్ డే నాడు

బాహుబలి ప్రభాస్ అక్టోబర్ 23న తన 39వ జన్మదినాన్ని జరుపుకోబోతున్నారు. దాంతో అభిమానులను ఉత్సాహానికి గురిచేసే కానుక ఏదైనా ఇవ్వాలని సాహో యూనిట్ ఆలోచించిస్తున్నది. ఇప్పటి వరకు గతేడాది పుట్టిన రోజున టీజర్‌ను మాత్రమే చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అప్పటి నుంచి ఎలాంటి సమాచారాన్ని పెద్దగా అందించలేదు.

 సాహో మేకింగ్ వీడియో రిలీజ్

సాహో మేకింగ్ వీడియో రిలీజ్

ఎంతో కాలంగా ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు సాహో మేకింగ్ వీడియోను అందించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా దుబాయ్‌లో షూట్ చేసిన ఛేజింగ్ సీన్లను బయటకు వదలాలని నిర్ణయం తీసుకొంటున్నట్టు తెలిసింది.

హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా

హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా

సాహో చిత్రం అద్భుతమైన అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకొంటున్నట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం దుబాయ్‌లో హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా యాక్షన్ సీన్లను చిత్రీకరించారు. ఈ సినిమాకు హాలీవుడ్ స్టంట్‌మన్లు పనిచేయడం విశేషం

 25 కోట్లతో భూర్జ్ ఖలీఫాపై

25 కోట్లతో భూర్జ్ ఖలీఫాపై

ప్రపంచంలోనే ఎత్తైన భవనం భూర్జ్ ఖలీఫా‌పై రూ.25 కోట్ల వ్యయంతో ఈ సీన్లను చిత్రీకరించారు. ఈ సన్నివేశాలు తెలుగు తెరపై ప్రేక్షకులకు కనువిందు చేయడం ఖాయమంటున్నది చిత్ర యూనిట్. కథలో భాగంగా వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడికి కొత్త అనుభూతికి గురిచేస్తాయని చెబుతున్నారు.

Recommended Video

Kangana Ranaut Interesting Comments On Prabhas
 శ్రద్ధాకపూర్ డబుల్ రోల్

శ్రద్ధాకపూర్ డబుల్ రోల్

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. చారిత్రక నేపథ్యంతో ఉండే ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ చిత్రం ద్వారా ప్రభాస్ నేరుగా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X