twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాహో టార్చర్ అంటూ ఫేక్ రివ్యూ.. ఎర్రి పుష్ఫం అంటూ క్రిటిక్‌పై నెటిజన్ల దాడి

    |

    దేశవ్యాప్తంగా సినీ అభిమానులను సాహో ఫీవర్ వెంటాడుతున్నది. గురువారం అర్ధరాత్రి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. బాహుబలి తర్వాత అత్యంత సాంకేతిక నిపుణులతో కలిసి రూపొందించిన సాహో మూవీ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా అత్యంత క్రేజ్‌తో వస్తున్న సినిమాకు ఫేక్ రివ్యూలు వెంటాడుతున్నాయి. అయితే ఫేక్ రివ్యూలపై సోషల్ మీడియాలో వార్ కొనసాగుతున్నది. ఇంతకీ ఫేక్ రివ్యూల విషయం ఏమిటంటే..

    బోరింగ్ సినిమా అంటూ

    బోరింగ్ సినిమా అంటూ

    సాహో ప్రీమియర్లు, స్పెషల్ షోలు ప్రదర్శితం కాకముందే.. తనకు తాను క్రిటిక్‌గా చెప్పుకొనే శివ సత్యం అనే ఓ వ్యక్తి ట్విట్టర్‌లో సాహో రివ్యూ రాశారు. సాహో గురించి ఒక్క మాటలో చెప్పాలంటే టార్చర్ అంటూ జడ్జిమెంట్ ఇచ్చేశాడు. అంతేకాకుండా ఫుల్‌టైమ్ బోరింగ్ సినిమా. దారుణమైన స్క్రీన్ ప్లే, మూడు గంటలపాటు తలనొప్పి అంటూ రివ్యూ రాశారు. అంతేకాకుండా 1/5 రేటింగ్ ఇచ్చాడు.

    సినిమాపై దారుణంగా కామెంట్

    సినిమాపై దారుణంగా కామెంట్

    ఇక అంతటితో ఆగకుండా క్రిటిక్ మరో అడుగు ముందేసి తన సినీ జోతిష్యాన్ని పండించేందుకు ప్రయత్నించినట్టు కనిపించింది. సాహో నాలుగు భాషల్లోనే కాకుండా ఓవర్సీస్, స్వదేశంలో కూడా ఫ్లాప్. సినిమాను చూడకుంటే మంచిది అనే ట్యాగ్ కూడా ఇచ్చాశాడు. దాంతో సదరు క్రిటిక్‌పై నెటిజన్లు మాటల కొరడాతో రఫ్ ఆడించారు.

    క్రిటిక్‌పై ట్రోల్స్‌తో దాడి

    శివ సత్యం రాసిన రివ్యూపై ధాటిగా అభిమానులు, నెటిజన్లు దాడి చేశారు. వారి అతడిపై రకరకాల మీమ్స్, వీడియోలో దండయాత్ర చేసినంత పని చేశారు.

    ఇది ముమ్మాటికి ఫేక్ రివ్య్యూ

    ఇది ముమ్మాటికి ఫేక్ రివ్య్యూ

    శివ సత్యం అనే వ్యక్తి రాసిన రివ్యూ ఫేక్. బాలీవుడ్ ఫ్యాన్ నడిపే అకౌంట్ అది. డిస్టిబ్యూటర్ పేరు చెప్పుకొని రివ్యూ రాశారు. ప్రపంచవ్యాప్తంగా సాహో ఫస్ట్ షో యూఏఈలో గురువారం రాత్రి 11.30 గంటలకు పడుతుంది. అప్పుడే ఈ వ్యక్తి ఎలా సినిమా చూశాడు అని ఝలక్ ఇచ్చాడు.

    నకిలీ అంటూ దుమ్ముదులిపి

    నకిలీ అంటూ దుమ్ముదులిపి

    అయ్యా ఇతని పేరు అస్లీ శివ కాదు.. నకిలీ శివ అంటూ ఓ నెటిజన్ దుమ్ముదులిపేశాడు. ఇతను ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాడు. అతని మాటల నమ్మకండి. షో ముగిసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఏ క్రిటిక్‌కు షో అరెంజ్ చేయలేదు. దుబాయ్‌లో గురువారం రాత్రి షో మొదలవుతుంది అని ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించారు.

    ఎందుకురా నీ ఏడుపు

    ఎందుకురా నీ ఏడుపు

    అస్లీ శివ అనే అకౌంట్‌తో శివ సత్యం రాసిన రివ్యూపై అభిమానులు భగ్గుమన్నారు. ‘ఇదేం ఏడుపు రా అయ్యా, ఎక్కడా ఒక్క షో కూడా పడలేదు. అప్పుడే రివ్యూ ఇచ్చాడు. ట్రైలర్ చూసి రివ్యూ రాశాడనుకొంటాను. వీడోక ఎర్రిపుష్పం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

    స్క్రీనింగ్ జరుగులేదు

    స్క్రీనింగ్ జరుగులేదు

    సాహో విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్క్రీనింగ్ జరుగలేదు. సోషల్ మీడియాలో వచ్చే రివ్యూలన్నీ ఫేక్ రివ్యూలే. ఇలాంటి రివ్యూలను పట్టించుకోకపోతేనే మంచింది అని మరో నెటిజన్ ఫేక్ రివ్యూపై స్పందించాడు.

     నేను ప్రైవేట్ షో చూశాను

    నేను ప్రైవేట్ షో చూశాను

    అయితే తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు శివ సత్యం స్పందించాడు. రిలీజ్ కాకముందే సాహో సినిమాను ఎక్కడ చూశావు అని అడిగే ప్రశ్నలకు నా వద్ద జవాబు ఉంది. ఓ డిస్ట్రిబ్యూటర్ అరెంజ్ చేసిన ప్రైవేట్ షోలో నేను చూశాను అని మరో ట్వీట్ చేయడం గమనార్హం.

    English summary
    Saaho is already the talk of the film circles and it is justified considering the enormous hype that the Prabhas starrer carries along with it. While audiences have booked tickets for tomorrow's shows, certain others are glued to social media awaiting the reports for this movie. However, a new report has seemingly left Prabhas fans in a state of shock and disbelief. A critic has come up with a review on Saaho and he, in turn has, termed the film as 'Torture'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X