twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహో’ కోసం... కోట్లు కుమ్మరించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్!

    |

    బాహుబలి, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రేంజి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ యంగ్ రెబల్ స్టార్ ఇపుడు రీజనల్ స్టార్ కాదు.. ఇండియా మొత్తం తన తర్వాతి సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసేలా సినీ అభిమానులను మాయ చేసిన బాహుబలి స్టార్.

    ప్రభాస్ రేంజికి తగిన విధంగా యూవి క్రియేషన్స్ సంస్థ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం కోసం దాదాపు రూ. 300 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు అంచనా. కేవలం యాక్షన్ సన్నివేశాల కోసమే రూ. 90 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    మీ టీఆర్పీ ఆటలోకి నన్ను లాగొద్దు.. నా భార్య, పిల్లలే ముఖ్యం: కౌశల్ రిక్వెస్ట్ మీ టీఆర్పీ ఆటలోకి నన్ను లాగొద్దు.. నా భార్య, పిల్లలే ముఖ్యం: కౌశల్ రిక్వెస్ట్

    అంచనాలు పెంచిప చాప్టర్ 1, చాప్టర్ 2

    అంచనాలు పెంచిప చాప్టర్ 1, చాప్టర్ 2

    సినిమా ప్రమోషన్లో భాగంగా ‘షేడ్స్ ఆఫ్ సాహో' పేరుతో చాప్టర్ 1, చాప్టర్ 2 మేకింగ్ వీడియోలు విడుదల చేయగా... అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వీటి కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ హైప్ కూడా బాగా పెరిగింది. పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు.

    కోట్లు కుమ్మరించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్

    కోట్లు కుమ్మరించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్


    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘సాహో' ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్రాన్ని రూ. 36 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ అమౌంట్.

    బాహుబలి ఎఫెక్టే...

    బాహుబలి ఎఫెక్టే...

    బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు ఓవర్సీస్ మార్కెట్లో భారీ వసూళ్లు సాధించడంతో ‘సాహో' చిత్రానికి మంచి డిమాండ్ ఏర్పడింది. మూవీ మేకింగ్ కూడా అదే స్థాయిలో ఉండటంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది.

    సాహో

    సాహో

    ‘సాహో' చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Saaho movie overseas rights of the film have been sold close to 36 crores. Saaho is an upcoming Indian action film, written and directed by Sujeeth, and produced by UV Creations, T-Series, and Dharma Productions. The film stars Prabhas, Shraddha Kapoor, Neil Nitin Mukesh and Evelyn Sharma, and is being shot simultaneously in Hindi, Tamil and Telugu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X