సాహోలో ప్రభాస్ పాత్రేంటో తెలుసా?.. శ్రద్ధాకపూర్ గురించి షాకింగ్ న్యూస్ లీక్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహూ చిత్ర షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఇటీవల దుబాయ్ లో భారీ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ ఫినిష్ చేసింది. 2019 ఆరంభంలోనే సాహో విద్దులయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. యువ దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, అల్ట్రా మోడ్రన్ హంగులతో సాహో చిత్రం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. తాజగా సాహో చిత్ర కథకు సంబందించి లీకులు మొదలయ్యాయి.

ఇంటర్నేషనల్ కంత్రీ
ప్రభాస్ ఈ చిత్రంలో ఇంటర్నేషనల్ దొంగగా కనిపిస్తాడట. కళ్ళు చెదిరే రాబరీలు చేసి క్షణాల్లో అక్కడి నుంచి మాయం అయిపోవడం అతడి ప్రత్యేకత. ఇతడి వలన పలు దేశాల్లో ఇంటర్ పోల్ అధికారులకు కంటిమీద కునుకు ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే సాహూ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఇదిని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పురాతన వజ్రాలు
ఈ చిత్రంలో ప్రభాస్ పలు దేశాల్లోనే పురాతన వజ్రాలు దొంగిలిస్తూ పోలీసులు కంట పడకుండా తిరుగుతుంటాడు. ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు అనేది సినిమా చూసే తెలుసుకోవాలి.

పోలీసు ఆఫీసర్
ప్రభాస్ ను పట్టుకోవడానికి ప్రయత్నించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరోయిన్ శ్రద్దా కపూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఊహించని మలుపులు, ఉత్కంఠ రేకెత్తించే పోరాట సన్నివేశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు సుజిత్ ఆసక్తికరంగా మలుస్తున్నాడు.

కీలక పాత్రల్లో
ఈ చిత్రంలో పులువురు బాలీవుడ్ తారలు నటిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం కావడంతో జాతీయ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న నటీనటుల్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేసుకున్నారు. మందిర బేడీ, ఎవిలిన్ శర్మ, అరుణ్ విజయ్ వంటి నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











