twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాహోను ఎదురించలేకపోయిన సైరా.. జాతీయస్థాయిలో ఏ హీరోకు ఎక్కువ క్రేజంటే!

    |

    జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటేందుకు రెండు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి సాహో కాగా, రెండోవది సైరా నర్సింహారెడ్డి. ఈ రెండు చిత్రాలు కూడా ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందాయి. ఒకటి అత్యంత సాంకేతిక విలువలతో హాలీవుడ్ ప్రమాణాలను తలదన్నేలా ఉంటే.. మరోటి చారిత్రాత్మక నేపథ్యంతోపాటు అత్యున్నత టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కింది. ఈ రెండు చిత్రాలు భారతీయ సినిమాపై ప్రత్యేక ముద్రను వేసుకోవడానికి ఒకదానికొకటి పడుతున్నాయి. ఇటీవల విడుదలైన ఈ రెండు సినిమాలకు సంబంధించిన టీజర్లు వాటి సత్తాను చాటుకొన్నాయి. టీజర్లకు వచ్చిన అనూహ్య స్పందన గురించి మరిన్నీ వివరాలు...

    సాహో టీజర్ వ్యూస్

    సాహో టీజర్ వ్యూస్

    బాహుబలి తర్వాత ప్రభాస్ జాతీయ స్థాయిలో నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రంలో శ్రద్దాకపూర్‌, నీల్ నితిన్ ముఖేష్, జాక్రీ ష్రాఫ్, మందిరా బేడితోపాటు పలువురు హిందీ తారలు నటిస్తున్నారు. దాంతో సాహో టీజర్‌పై అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగినట్టు సాహో టీజర్ 44.5 మిలియన్ల వ్యూస్, 127 మిలియన్ లైక్స్ సాధించింది.

    సైరా వ్యూస్

    సైరా వ్యూస్

    సైరా కూడా జాతీయ స్థాయి ప్రాజెక్ట్‌గా మారింది. అమితాబ్, సుదీప్ కిచ్చ, విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు లాంటి నటులతో క్రేజీ మూవీగా ముద్రవేసుకొన్నది. ఇక ఇటీవల రిలీజైన సైరా టీజర్ కూడా భారీ వ్యూస్ సాధించింది. 24 గంటల్లో 23.5 మిలియన్ వ్యూస్ సాధించగా, 1 మిలియన్ లైక్స్ సాధించింది.

    అత్యధిక లైక్స్ సాధించిన సినిమాలు

    అత్యధిక లైక్స్ సాధించిన సినిమాలు

    ఇక టాలీవుడ్‌ చిత్రాలకు సంబంధించిన టీజర్లు సోషల్ మీడియాలో సృష్టించిన ప్రభంజనం ఇలా ఉంది. రిలీజైన 24 గంటల్లో అత్యధికంగా లైక్స్ సాధించిన చిత్రాలు జాబితా ఇవే.. సాహో 455K (4.5 లక్షలు), అజాతవాసి 421k (4.21 లక్షలు), సైరా టీజర్ 352K, అరవింద సమేత 292K, మహర్షి 287K, భరత్ అనే నేను 282K, రంగస్థలం 250K వ్యూస్ సాధించింది.

    అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాలు

    అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాలు

    తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్లలో సాహో ముందుంది. సాహో 12.9 మిలియన్లు, మహర్షి 11.14 మిలియన్లు, భరత్ అనే నేను 8.67 మిలియన్లు, సైరా 7.2 మిలియన్లు, వినయ విధేయ రామ 6.79 మిలియన్లు, అజాతవాసి 5.92 మిలియన్లు, అరవింద సమేత 5.9 మిలియన్ల వ్యూస్‌ను సాధించాయి. దాంతో తాజా సినిమాలను రికార్డులను పరిశీలిస్తే సాహో టాప్‌లో ఉండగా, సైరా ఆ తర్వాత స్థానాల్లో ఉంది.

    ఆగస్టు 30 సాహో, అక్టోబర్ 2న సైరా

    ఆగస్టు 30 సాహో, అక్టోబర్ 2న సైరా

    బాహుబలి ప్రభంజనం తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత ప్రభాస్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి మేకింగ్‌తో ఈ సినిమా రూపొందడంతో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక సైరాది కూడా ఇదే పరిస్థితి. ఈ చిత్ర టీజర్ ఇటీవల రిలీజైంది. ఈ సినిమాతో చిరంజీవి మరోసారి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

    English summary
    Tollywood's two prestigeous projects Saaho movie, Sye Raa are making impact on National level. Saaho teaser gets most like and views at top level.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X