twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహో’ టికెట్ రేట్లు పెరిగాయి... ఏ ఏరియాలో ఎంత?

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం 'సాహో'. బాహుబలి లాంటి మెగా బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. అందుకు తగిన విధంగానే క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 'సాహో' చిత్రాన్ని రూ. 350 కోట్ల బడ్జెట్‌తో యూవి క్రియేషన్స్ వారు నిర్మించారు. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టుకు కేవలం ఒక చిన్న సినిమా చేసిన అనుభవం ఉన్న సుజీత్‌ను దర్శకుడిగా పెట్టడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే హీరో ప్రభాస్‌తో పాటు నిర్మాతలు సుజీత్ టాలెంట్ మీద పూర్తి నమ్మకం ఉంచారు.

    రేట్ల పెంపు విషయం హాట్ టాపిక్

    రేట్ల పెంపు విషయం హాట్ టాపిక్

    ఆగస్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాధారణంగా పెద్ద బడ్జెట్ సినిమాల విడుదల సమయంలో టిక్కెట్ రేట్ల పెంపు అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ‘సాహో' విషయంలో కూడా అదే చర్చనీయాంశం అవుతోంది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో నిర్మాతలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలకు రేట్ల పెంపు అంశంపై వినతి పెట్టుకున్నారు.

    ఆంధ్రప్రదేశ్‌లో రూ. 100 టికెట్ రూ. 200లకు పెంపు

    ఆంధ్రప్రదేశ్‌లో రూ. 100 టికెట్ రూ. 200లకు పెంపు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ల రేటు పెంపుకు అనుమతి లభించింది. తొలి రెండు వారాల పాటు రేట్లు పెంచి టిక్కెట్లు అమ్మే విధంగా యూవీ క్రియేషన్స్ వారు చేసిన విజ్ఞప్తికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సాధారణంగా రూ.100 ఉండే టికెట్ రేటు రూ.200కు పెరిగింది.

    తెలంగాణలో పరిస్థితి ఏమిటి?

    తెలంగాణలో పరిస్థితి ఏమిటి?

    తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ ప్రభుత్వం టిక్కెట్ల రేటు పెంపుకు అనుమతి ఇవ్వలేదు అనే ప్రచారం జరుగుతోంది కానీ బుక్ మై షో లాంటి ఆన్‌లైన్ వెబ్ సైట్లలో టికెట్ల రేట్లు పరిశీలిస్తే ఇక్కడ కూడా రేట్లు ఏపీలో మాదిరిగా రెట్టింపు కాకపోయినా... కొంతమేర పెంచినట్లు స్పష్టమవుతోంది.

    తెలంగాణలో టికెట్ల రేట్లు ఇలా...

    తెలంగాణలో టికెట్ల రేట్లు ఇలా...

    తెలంగాణలో అల్వాల్ ఏరియాలో ఓ థియేటర్లో రన్ అవుతున్న కౌశల్య కృష్ణ మూర్తి బాల్కనీ టికెట్ రేటు రూ. 70 ఉంది. అదే వచ్చే వారం ఇదే థియేటర్లో విడుదల కాబోతున్న ‘సాహో' టికెట్ రేటు రూ. 150 గా చూసిస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓ ప్రముఖ థియేటర్లో ప్రస్తుతం ప్రదర్శితం అవుతున్న కేడి నెం.1 చిత్రానికి టికెట్ రేటు రూ. 112గా చూపిస్తుండగా, వచ్చే వారం విడుదల కాబోతున్న ‘సాహో'కు టికెట్ రేటు రూ. 150గా చూపిస్తోంది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ సమయంలో రూ. 100 నుంచి రూ. 112 గా ఉన్న టికెట్ రేటు.... వచ్చేవారం విడుదలయ్యే ‘సాహో' విషయంలో రూ. 200గా చూపిస్తోంది. దీన్ని బట్టి ఇటు తెలంగాణతో పాటు, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టికెట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.

    మల్టీ ప్లెక్స్ థియేటర్లలో

    మల్టీ ప్లెక్స్ థియేటర్లలో

    అయితే మల్టీ‌ప్లెక్స్ థియేటర్లలో మాత్రం రేట్ల పెంపు పెద్దగా లేదు. సాధారణ సమయంలో కాస్త హెచ్చు రేట్లు ఉన్నట్లే.... ‘సాహో' విడుదల సమయంలో కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ‘సాహో' రేట్ల పెంపు నిర్ణయం మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులపై పెద్దగా ఎఫెక్ట్ చూపడం లేదు, ధరల పెంపు సెగ తగిలేది సామాన్యుడికే!

    English summary
    Permission has been given from the governments of the states of Andhra Pradesh and Telangana to increase the ticket rates for the Saaho Movie. The ticket rate in Andhra Pradesh has been increased from Rs. 100 to Rs. 200. Considering the rates on online booking websites in the Telangana region, Rs. 100 to Rs. Increased to Rs. 150.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X