సాహో కొత్త షెడ్యూల్ విశేషాలు!
ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సాహూ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ చేస్తున్న చిత్రం కావడంతో జాతీయవ్యాప్తంగా సాహో పై క్రేజ్ నెలకొని ఉంది. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
గత రెండు నెలలుగా ఎడతెరిపిలేకుండా చిత్ర యూనిట్ యాక్షన్ సన్నివేశాల్ని దుబాయ్ లో చిత్రికరించారు. ఈ భారీ షెడ్యూల్ పూర్తయింది. నిర్మాతలు తదుపరిషెడ్యూల్ కు ప్లాన్ చేస్తున్నారు. సాహో చిత్ర కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించే సన్నివేశాలకు అనువైన భారీ సెట్ నిర్మిస్తున్నారట. 2019 లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకుడు.


Click it and Unblock the Notifications











