twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహో’ పార్ట్ 2 ఉండబోతోందా? సీక్రెట్ బయట పెట్టిన ప్రభాస్

    |

    తెలుగు ఇండస్ట్రీకి పరిమితమై సినిమాలు చేసినంతకాలం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే బాహుబలి హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కావడంతో బాలీవుడ్ మీడియాకు మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం మొదలు పెట్టారు యంగ్ రెబల్ స్టార్. అసలు ఇంటర్వ్యూలు ఇవ్వడాన్ని ఇబ్బంది ఫీలయ్యే ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' కోసం వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తెలుగు సినిమాల్లో తాను ఎప్పుడూ ఇన్ని ఇంటర్వ్యూలు ఇవ్వలేదని, నేను ఇప్పటి వరకు తెలుగులో చేసిన సినిమాలన్నింటికీ మించిలా 'సాహో' కోసం అనే ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు ప్రభాస్ తెలిపారు.

    మా వాళ్లు చాలా ఖర్చు పెట్టారు, అందుకే తప్పడం లేదు

    మా వాళ్లు చాలా ఖర్చు పెట్టారు, అందుకే తప్పడం లేదు

    తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో యంగ్ రెబల్ స్టార్ మాట్లాడుతూ... సాధారణంగా నాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం పెద్దగా నచ్చుదు. కానీ ‘సాహో' కోసం మా వాళ్లు ఎక్కువగా ఖర్చు పెట్టారు. అందుకే ఇవి తప్పడం లేదు అన్నారు ప్రభాస్.

    ఇపుడు నాకు ఎవరి సపోర్ట్ లేదు

    ఇపుడు నాకు ఎవరి సపోర్ట్ లేదు

    బాహుబలి సమయంలో రానా ఉన్నాడు, రాజమౌళి, అనుష్క, తమన్నా ఇలా సపోర్ట్ చేయడానికి చాలా మంది ఉన్నారు. కానీ ఇపుడు నేను ఒక్కడినే అయిపోయాను. వేరే ఆప్షన్ లేదు. గతంతో పోలిస్తే ఇంటర్వ్యూలు కాస్త అలవాటయ్యాయి. గతంలో సినిమా కంటే ఇంటర్వ్యూలు చాలా కష్టంగా అనిపించేది. ఇపుడు అలా అనిపించడం లేదు.

    అది కోపంగా అన్నమాట కాదు, కేవలం సరదాగా అన్నాను

    అది కోపంగా అన్నమాట కాదు, కేవలం సరదాగా అన్నాను

    గతంలో ప్రభాస్ ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘అవకాశం ఇస్తే ఇంటర్వ్యూలనే తీసేస్తాను' అన్నసంగతి తెలిసిందే. దానిపై తాజాగా స్పందిస్తూ తనకు ఇంటర్వ్యూలంటే కోపం కాదని, అది సరదాగా అన్నమాట మాత్రమే అన్నారు. సినిమా ఆడియన్స్ కు రీచ్ అవ్వాలంటే మీడియా వారి ఇంటర్వ్యూల ద్వారానే సాధ్యమని తెలిపారు. బేసికల్‌‌గా నేను సోషల్ టైమ్ కాదు, అందుకే నాకు కాస్త కష్టంగా ఉంటుంది. కానీ వాటి వ్యాల్యూ నాకు తెలుసు అన్నారు.

    ఐదారేళ్ల నుంచి ఈ ప్రెజర్ ఉంది

    ఐదారేళ్ల నుంచి ఈ ప్రెజర్ ఉంది

    పెద్ద బడ్జెట్ సినిమా చేసినపుడు తెలియకుండానే ప్రెజర్ పడుతుంది. నాకు కంటిన్యూస్‌గా ఐదారేళ్ల నుంచి ఈ ప్రెజర్ ఉంది. ‘సాహో' ముందు ఇంత పెద్ద బడ్జెట్ అనుకోలేదు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం వల్లే ఇంత ఖర్చయింది. ముందు ఈ సినిమాను రూ. 150 కోట్లలో అనుకున్నాం. కానీ మొత్తం రూ. 350 కోట్లు ఖర్చయింది.

    వరుసగా ప్లాపులు వచ్చాయి

    వరుసగా ప్లాపులు వచ్చాయి

    గతంలో తనకు వరుస ప్లాపులు కూడా వచ్చాయి. సినిమా ప్లాప్ అయినపుడు కాస్త ఫీలవుతాను. అయితే వెంటనే రికవరీ అవుతాను. ఏం మిస్సయ్యాను, ఎక్కడ మిస్సయ్యాను అని ఆలోచిస్తాను. తర్వాత అలాంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకుంటాను.

    సాహో పార్ట్ 2 రావొచ్చు

    సాహో పార్ట్ 2 రావొచ్చు

    ‘సాహో' మూవీని సుజీత్ చాలా పెద్దగా డిజైన్ చేశారు. ఒక వేళ ఇది బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అయితే పార్ట్ 2 ఉంటే ఉండొచ్చు. అయితే ఇంకా ప్లాన్ అయితే చేయలేదు. అయితే ఇది వెంటనే ఉండదు. రెండు మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకుంటాను. సాహో అయిన వెంటనే మరో పెద్ద సినిమా చేసే సమస్యే లేదు. ఆల్రెడీ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది, 20 రోజులు షూట్ చేశాం. ఇది లవ్ స్టోరీ అని ప్రభాస్ తెలిపారు.

    అనుష్కతో పెళ్లి రూమర్స్ విషయంలో

    అనుష్కతో పెళ్లి రూమర్స్ విషయంలో

    అనుష్క విషయంలో ఏం చెప్పినా ఈ రూమర్లు ఆగవని అర్థమైంది. ఇవి ఆగాలంటే అనుష్కకైనా పెళ్లి కావాలి, నాకైనా పెళ్లి కావాలి. మొదట్లో ఇలాంటి వార్త విన్నప్పుడు రూమరే కదా కొన్ని రోజులకు పోతుందిలే అనుకున్నాను. అయినా మా మధ్య అలాంటిదేమైనా ఉంటే హైడ్ చేయాల్సిన అవసరం లేదు.

    సినిమా వాళ్లకు ఇలాంటివి తప్పదు

    సినిమా వాళ్లకు ఇలాంటివి తప్పదు

    అనుష్క, నేను ఫ్రెండ్స్ మాత్రమే. మేమ ఎక్కడైనా తిరుగుతూ కనిపిస్తే, లేదా బీచ్ లో కనిపిస్తే మా మధ్య అలాంటిదేమైనా ఉంది అనుకోవచ్చు. ఆవిడ ఎక్కడో తన పని తాను చేసుకుంటోంది, నా పని నేను చూసుకుంటున్నాను. మా విషయంలో రూమర్స్ ఆగవనే విషయం అయితే అర్థమైంది. అందుకే ఇద్దరం ఇలాంటి వార్తలను లైట్ తీసుకున్నాం. ఎందుకంటే సినిమా వాళ్ల లైఫ్ లో ఇలాంటివి కూడా భాగమే.

    ఏ తల్లికైనా కొడుకు పెళ్లి చేసుకోవాలని ఉంటుంది

    ఏ తల్లికైనా కొడుకు పెళ్లి చేసుకోవాలని ఉంటుంది

    పెళ్లి గురించి నేను నిజంగా ఆలోచించడం లేదు, అందులో దాయడానికి ఏమీ లేదు. అమ్మ నుంచి పెళ్లి విషయంలో ప్రెజర్ ఉంది. ఏ తల్లికైనా తన కొడుకు పెళ్లి చేసుకుని తనకు మనవళ్లను ఇవ్వాలనే
    ఆశ ఉంటుంది. కానీ నేనే ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేక పోతున్నాను అన్ని ప్రభాస్ తెలిపారు.

    English summary
    "Saaho Part 2 may be, but not yet planned. The producers have spent a lot of budget for the saaho. Based on the success of the film, we decide on a sequel." Prabhas said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X