ఇక ఎప్పటికీ ఇలాంటి సినిమా రాదనే రేంజ్‌లో సాహో తీశారు: అల్లు అరవింద్
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' మరో పది రోజుల్లో(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాహో మూవీలో ఉపయోగించిన వస్తువులు, వాహనాలు కూడా ప్రదర్శనకు ఉంచడం గమనార్హం. వేలాది మంది అభిమానులు ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలి వచ్చారు.
Photo Gallery: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ సందర్బంగా వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''అందరికీ నమస్కారం. గొప్పని ముందు ఎలాగైతే గణపతి పూజ చేస్తామో.. ఆల్ ఇండియాలో ఎంత పెద్ద సినిమా విషయంలో అయినా ముందుగా తలచుకోవాల్సింది బాహుబలి. అందువల్ల గణపతి పూజకి బాహుబలిలా అయింది ఈ పెద్ద సినిమాలకు బాహుబలి.

అప్పట్లో మామూలు హీరో అయిన మన తెలుగు హీరో ఈ రోజు ఆల్ ఇండియా లెవెల్‌లో బిగెస్ట్ స్టార్‌గా ఎదగటం గర్వించదగిన విషయం. ఇక నిర్మాతలు ప్రమోద్, వంశీలకు భయం అంటే ఏంటో తెలియదు. ఏ మాత్రం భయం లేకుండా వారు వందల కోట్లు ఖర్చు చేశారు. ఇలాంటి సినిమా ఇంతకు ముందు రాలేదు.. ఇక ఎప్పటికి వస్తుందో అన్న రేంజ్‌లో ఈ సినిమాను నిలబెట్టిన డైరెక్టర్ సుజీత్‌కి, నిర్మాతల ధైర్యానికి, ఆ ధైర్యం నింపిన రాజమౌళికి అభినందనలు చెబుతున్నా. సాహో టీమ్ అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా'' అన్నారు.

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సాహో చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో రెబల్‌స్టార్ ప్రభాస్ సరసన శ్రధ్ధాకపూర్ నటించగా జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











