Don't Miss!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- News చిలుకూరు బాలాజీ ఆలయానికి గరుడ ప్రసాదం కోసం భక్తుల రష్.. అసలేమిటీ గరుడ ప్రసాదం?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్: రామోజీ ఫిల్మ్ సిటీలో వేడుక షురూ...
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' మరో పది రోజుల్లో(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాహో మూవీలో ఉపయోగించిన వస్తువులు, వాహనాలు కూడా ప్రదర్శనకు ఉంచడం గమనార్హం. వేలాది మంది అభిమానులు ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలి వచ్చారు.
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు.. రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రధ్ధాకపూర్, జాకీషరఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు..
ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి 'సాహో' గురించి మాట్లాడారు. 'ఈ ఫంక్షన్ చూస్తుంటే సముద్రాన్ని చూసినట్లు ఉంది. అక్కడ ఎటువైపు చూసినా నీరే కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఎటు చూసినా జనాలే కనిపిస్తున్నారు. ఈ ఫంక్షన్లో ఇంత మందిని చూడడం ఆనందంగా ఉంది. గొప్పగా ఫీల్ అవుతున్నాను' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ... సాహో ఇండియాలో బిగ్గెస్ట్ మూవీ. ఇది మా ఓన్ మూవీ కాబట్టి ఎక్కువగా చెప్పలేం. కానీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. 4 సంవత్సరాల నుంచి రోజుకు 20 గంటలు కంటిన్యూగా కష్టపడ్డారు. నిర్మాతల పాషన్‌కు తల వంచి నమస్కరిస్తున్నాను. సుజీత్ ఎంతో మంది యంగ్ డైరెక్టర్లకు స్పూర్తి అని వ్యాఖ్యానించారు.
యాక్టర్ రవి వర్మ మాట్లాడుతూ.. ''సాహో అనేది దేశం లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది అందరికీ తెలుసు. ఈ సినిమా ప్రభాస్ యాక్షన్ హైలైట్ గా నిలుస్తుంది. సాహో నాకు భాగం కల్పించినందుకు యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు'' అని అన్నాడు.
మురళీ శర్మ హాయ్ డార్లింగ్స్ అంటూ ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపారు. ఆయన మాట్లాడుతూ.. ''సాహోలో భాగం కావడం ఆనందంగా ఉంది. మీ లవ్, సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మళ్ళీ ఇదే రేంజ్ లో సక్సెస్ మీట్లో కలవాలని కోరుకుంటున్నా. యూవీ క్రియేషన్స్ నా హోమ్ బ్యానర్ అని గర్వంగా చెబుతున్నా.
'సాహో' చూశాక ప్రభాస్ అభిమానులుగా గర్వపడతారు: అరుణ్ విజయ్
సాహోలో మనోజ్ విశ్వాంక్ పాత్ర పోషించిన అరుణ్ విజయ్ ప్రసంగిస్తూ ... ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుజీత్ గారికి, నిర్మాత ప్రమోద్ గారికి, ఈ క్యారెక్టర్ నేను చేస్తే బావుంటుందని చెప్పిన మన రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ గారికి థాంక్స్' అని వ్యాఖ్యానించారు. ఈ సినిమాకు ఇంత మంది ప్రముఖులతో కలిసి పని చేయడం వండర్ఫుల్ ఎక్స్ పీరియన్స్. మనం అంతా గర్వించాల్సిన సమయం ఇది. ప్రభాస్ సర్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లారు. ఆయన ఇపుడు ప్యాన్ ఇండియా స్టార్. సుజీత్ చాలా చిన్నవాడు.. కానీ ఆయన పని తీరు చూసి ఆశ్చర్యపోయాను. ఇందులో ఎంతో మంది సూపర్ టెక్నీషియన్లు పని చేశారు. సినిమా అభిమానులకు ట్రీట్ లా ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభాస్‌తో తర్వాతి సినిమా చేయబోతున్న దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ... సాహో ఇండియాలో బిగ్గెస్ట్ మూవీ. ఇది మా ఓన్ మూవీ కాబట్టి ఎక్కువగా చెప్పలేం. కానీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. 4 సంవత్సరాల నుంచి రోజుకు 20 గంటలు కంటిన్యూగా కష్టపడ్డారు. నిర్మాతల పాషన్‌కు తల వంచి నమస్కరిస్తున్నాను. సుజీత్ ఎంతో మంది యంగ్ డైరెక్టర్లకు స్పూర్తి అన్నారు.