నిజం చెప్పిన సుజీత్.... షార్ట్ ఫిల్మ్స్ తీసి ‘సాహో’ డైరెక్టర్ ఎలా అయ్యాడంటే?

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' మరో పది రోజుల్లో(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాహో మూవీలో ఉపయోగించిన వస్తువులు, వాహనాలు కూడా ప్రదర్శనకు ఉంచడం గమనార్హం. వేలాది మంది అభిమానులు ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలి వచ్చారు.

Photo Gallery: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్

అందుకే ప్రభాస్ ఫ్యాన్స్... డై హార్డ్ ఫ్యాన్స్

అందుకే ప్రభాస్ ఫ్యాన్స్... డై హార్డ్ ఫ్యాన్స్

ఈ సందర్భంగా దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అభిమానులు చాలా మంది హీరోలకు ఉంటారు. కానీ ప్రభాస్ గారి అభిమానులను డై హార్డ్ ఫ్యాన్స్ అని ఎందుకు అన్నానంటే... వారి పేషెన్స్ లెవల్స్‌కు హాట్సాఫ్. బాహుబలి 1, బాహుబలి 2 లాంటి అద్భుతమైన సినిమాల తర్వాత వెంటనే ఒక సినిమా రావాలనే కోరిక అభిమానులకు ఉంటుంది. సంవత్సరానికి ఒక సినిమా అయినా రావాలని ఉంటుంది. కానీ 2 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు అభిమానులకు థాంక్స్.

అందుకే నాకు ఎలాంటి టెన్షన్ లేదు

అందుకే నాకు ఎలాంటి టెన్షన్ లేదు

ఇటీవల ప్రభాస్ గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... సెట్స్‌లో మాకు చాలా టెన్షన్ ఉండేది, కానీ సుజీత్ ఫేసులో మాత్రం ఆ టెన్షన్ చూడలేదు అన్నారు. నా టెన్షన్ ఎప్పుడూ నా చుట్టూ ఉండే స్నేహితులకు, మా ఫ్యామిలీకి, ముఖ్యంగా మా అమ్మా నాన్నకు ఎక్కువగా ఇస్తూ ఉంటాను. వారు దాన్ని తీసుకోవడం వల్లనే నేను టెన్షన్ లేకుండా షూట్ చేయగలిగాను.

షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్... ‘సాహో'కు డైరెక్టర్ అలా అయ్యా

షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్... ‘సాహో'కు డైరెక్టర్ అలా అయ్యా

ఈ సినిమా గురించి మాట్లాడాలంటే... నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను. నా షార్ట్ ఫిల్మ్స్ డీవీడీ సిద్ధార్థ్ అనే అన్న ద్వారా యువి క్రియేషన్స్‌కు వెళ్లడం, అది ప్రభాస్ గారు చూడటం, ఈడు స్క్రీన్ ప్లే బాగా చేస్తున్నాడు అని ఒకసారి పిలవండి అన్నారట. నాకు ఇంకా గుర్తుంది... సుదర్శన్ థియేటర్లో మిర్చి సినిమా మా నాన్నతో కలిసి చూస్తుండగా నాకు ప్రభాస్ గారు రమ్మన్నారనే విషయం తెలిసింది. మనం ఎక్కడ? ప్రభాస్ గారెక్కడ? మనల్ని ప్రభాస్‌గా పిలవడం ఏమిటి అనుకున్నాను. మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చూస్తున్నపుడు అదే సినిమా ప్రొడ్యూసర్ నన్ను పిలిచారు అంటే నాకు చిన్న సందేహం ఉండి వెళ్లలేదు. కొన్ని నెలల తర్వాత యూవి క్రియేషన్స్‌కు వెళ్లి కలిసినపుడు ఏం డార్లింగ్ అపుడు పిలిచాను రాలేదు అన్నారు.

ప్రభాస్ అన్న 100 టిబి హార్డ్ డిస్క్

ప్రభాస్ అన్న 100 టిబి హార్డ్ డిస్క్

ఇక్కడ నేను ప్రభాస్ గారి గురించి ఒక సూపర్బ్ విషయం చెప్పాలి. ప్రభాస్ గారు 100 టిబి హార్డ్ డిస్క్ లాంటి వారు. మీరు ఎన్ని విషయాలు మాట్లాడినా అవన్నీ ఆయన మైండ్లో ఉంటాయి. ఒక 4 సంవత్సరాల తర్వాత కూడా ఆయనకు అది గుర్తు ఉంటుంది. ట్రైలర్లో హెయిర్ నుంచి బ్లడ్ వచ్చే షాట్ గురించి 2014 నవంబర్లో కథ చెప్పినపుడు చెప్పాను. ఆ సీన్ గురించి చెప్పగానే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. తర్వాత మూడేళ్ల తర్వాత ఆయన ఆ సీన్ షూట్ చేసినపుడు ఆ షాట్ గురించి ఎప్పుడు చెప్పానో డేట్, టైమ్‌తో గుర్తు చేశారు.

ప్రభాస్ అన్నే నాలో కాన్ఫిడెన్స్ నింపారు

ప్రభాస్ అన్నే నాలో కాన్ఫిడెన్స్ నింపారు

బాహుబలి సినిమాకు రాజమౌళి లాంటి బెస్ట్ టెక్నీషియన్‌తో పని చేసిన హీరోతో నేను సినిమా చేస్తున్నాను. ఆ కాన్ఫిడెన్స్ లెవల్ నాకు ఉంది అంటే కారణం ప్రభాస్ అన్న... నన్ను నమ్మి వీడు సినిమా తీయగలడు అంటూ నాలో కాన్ఫిడెన్స్ నింపారు.

వారి వల్లే ఈ సినిమా సాధ్యమైంది

వారి వల్లే ఈ సినిమా సాధ్యమైంది

‘సాహో'లో పెద్ద పెద్ద టెక్నీషియన్లు, బిగ్ యాక్షన్ ఉంది లాంటి విషయాలు పక్కన పెడితే... కథ అనుకున్నపుడు ఇంత పెద్ద ఈవెంట్ చేస్తామనో, ట్రైలర్ ఈ రేంజిలో వస్తుందని ఎవరికీ తెలియదు. ఆ సమయంలో మనం చెప్పిన కథను మాత్రమే నమ్మి ఇంత భారీ స్థాయిలో రావడానికి కారణమైన టెక్నీషియన్లకు థాంక్స్. మది సర్, సాబు సర్, శ్రీకర్ ప్రసాద్ సర్ లాంటి వారి వల్లే ఇది సాధ్యమైంది అని సుజీత్ తెలిపారు.

సాహో

సాహో

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. న‌టీన‌టులు.. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, శ్రధ్ధాక‌పూర్‌, జాకీష‌ర‌ఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X