ఇండియాలోనే అతిపెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్‌గా ‘సాహో’ రికార్డ్... ఖర్చెంతో తెలుసా?

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సాహో'. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈచిత్రం ఇండియాలో తెరకెక్కిన అతిపెద్ద యాక్షన్ చిత్రాల్లో ఒకటి. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో దీన్ని రూపొందించారు. ఇండియా వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు.

ఆదివారం సాయంత్ర రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైన ప్రీ రిలీజ్ ఈవెంటుకు సుమ యాంకరింగ్ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... భారత దేశంలో ఇప్పటి వరకు ఏ సినిమా విషయంలో జరుగని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. భారతీయ సినీ చరిత్రలో ఇదొక రికార్డుగా ఆమె పేర్కొన్నారు.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈవెంట్ కోసం రూ. 2.5 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. శ్రేయాస్ మీడియా సంస్థ దీన్ని ఆర్గనైజ్ చేస్తోంది. దాదాపు లక్ష మంది అభిమానులు ఈవేడుకకు తరలి వచ్చినట్లు తెలుస్తోంది.

Photo Gallery: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్

Saaho Pre Release Event is Indias biggest movie Pre Release event

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

న‌టీన‌టులు.. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, శ్రధ్ధాక‌పూర్‌, జాకీష‌ర‌ఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X