‘సాహో’ ప్రీ రిలీజ్: ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ రచ్చ.. రద్దు చేస్తామని నిర్వాహకుల వార్నింగ్!

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' మరో పది రోజుల్లో(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాహో మూవీలో ఉపయోగించిన వస్తువులు, వాహనాలు కూడా ప్రదర్శనకు ఉంచడం గమనార్హం. దాదాపు లక్ష మంది అభిమానులు ఈ వేడుకకు తరలి వచ్చినట్లు తెలుస్తోంది.

Saaho Pre Release Event: Prabhas fans created disturbances

అయితే అభిమానులు క్రమశిక్షణగా ఉండక పోవడం, బారికేట్లు దాటి సభా వేదిక వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో వారిని అదుపుచేయడానికి పోలీసుల చాలా శ్రమించాల్సి వచ్చింది. కొందరిపై లాఠీ ఝులిపించారు. ఒకానొక సందర్భంలో నిర్వాహకులు అభిమానుల తీరు మార్చుకోకపోతే ఈవెంట్ కేన్సిల్ చేయాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు. అభిమానుల తీరుతో ఈవెంట్ కొంతసేపు నిలిచిపోయింది.

'సాహో' సినిమా విషయానికొస్తే యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Saaho Pre Release Event: Prabhas fans created disturbances

న‌టీన‌టులు.. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, శ్రధ్ధాక‌పూర్‌, జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X