వీడియో: రాజమౌళి అలా అనడంతో కుమిలి కుమిలి ఏడ్చిన ప్రభాస్.. సాహో వేడుకలో షాకింగ్ దృశ్యాలు

Recommended Video

SS Rajamouli Speech - Saaho Pre Release Event

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'సాహో'. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాఆగస్టు 30 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఎంతో మంది అతిరథ మహారథులు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో వచ్చారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో ప్రభాస్ కన్నీటి పర్యంతం అయ్యాడు. దీనికి కారణం ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలే. పూర్తి వివరాల్లోకి వెళితే...

సుజిత్‌ను ప్రశంసించిన రాజమౌళి

సుజిత్‌ను ప్రశంసించిన రాజమౌళి

ఈ కార్యక్రమంలో దర్శకధీరుడు రాజమౌళి.. సుజిత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘బాహుబలి లాంటి సినిమా తర్వాత ప్రభాస్ చేసే సినిమాపై అంచనాలు ఉంటాయి. ఇంత పెద్ద సినిమాను సుజీత్‌ డీల్‌ చేయగలడా? అని చాలా మందికి అనుమానం ఉంది. ఫస్ట్‌లుక్‌ వచ్చినప్పుడే సినిమా స్థాయి తెలిసింది. ఇక, ట్రైలర్‌తో అతడిలోని ప్రతిభ బయటకు వచ్చింది. ఒక ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌లా సుజీత్‌ ఈ సినిమా చేశాడు' అని అభినందించారు.

నిజంగా ధైర్యం ఉండాలి

నిజంగా ధైర్యం ఉండాలి

అలాగే, నిర్మాతల గురించి రాజమౌళి స్పందిస్తూ... ‘నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు ప్రభాస్ ఏమడిగితే అది చేసేస్తారు. ఏమడిగితే అది ఇచ్చేస్తారు. ప్రభాస్ అంటే వాళ్లకు అంత ఇష్టం, అంత నమ్మకం. సినిమా మీద చాలా ఖర్చుపెట్టారు. ఇలాంటి సినిమా తీయాలంటే నిర్మాతలకు ఎంతో ధైర్యం ఉండాలి. నిజంగా వాళ్లను అభినందిస్తున్నా. నాకు కచ్చితంగా నమ్మకంగా ఉంది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని. ప్రమోద్, వంశీలకు వాళ్ల పెట్టిన డబ్బుల కంటే డబుల్, ట్రిపుల్ వచ్చేయాలని కోరుకుంటున్నా' అని ఆయన పేర్కొన్నారు.

ప్రభాస్ గురించి చెబుతూ...

ఈ వేడుకలో రాజమౌళి.. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ‘ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ల హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. కానీ, ప్రభాస్ సినిమాని అందరు హీరోల ఫ్యాన్స్ హిట్టవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రభాస్ ఏ రోజూ ఎవరి గురించీ చెడుగా మాట్లాడడు. తన చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్రేషనే తనకి అంత మంది ఫ్యాన్స్‌ని తెచ్చిపెట్టింది. ప్రభాస్ ఇప్పటికే ఆల్ ఇండియా స్టార్. అతడిని ఎంత ముందుకు తీసుకెళ్తే అంత వెళ్లాలి' అని చెప్పుకొచ్చారు.

కుమిలి కుమిలి ఏడ్చిన ప్రభాస్

కుమిలి కుమిలి ఏడ్చిన ప్రభాస్

ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతున్న సమయంలో షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి మాట్లాడుతున్న సమయంలో ప్రభాస్ భావోద్వేగానికి గురయ్యాడు. అంతేకాదు, రాజమౌళి స్పీచ్ అయ్యే వరకు కుమిలి కుమిలి ఏడవడం కనిపించింది. మొదటి సారి ప్రభాస్‌ను ఇలా చూసిన వారితో పాటు లైవ్ చూస్తున్న వారందరూ కూడా ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.

సాహో గురించి..

సాహో గురించి..

యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో'. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ఏ, విక్ర‌మ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ సరసన శ్రధ్ధాక‌పూర్‌ నటించగా జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X