సుజీత్ చాలా చిన్న కుర్రోడు.. ఓ రోజు ప్రభాస్ చాలా ఎక్సయిటెడ్‌గా వచ్చి.. రాజమౌళి

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' మరో పది రోజుల్లో(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాహో మూవీలో ఉపయోగించిన వస్తువులు, వాహనాలు కూడా ప్రదర్శనకు ఉంచడం గమనార్హం. వేలాది మంది అభిమానులు ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలి వచ్చారు.

Photo Gallery: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్

వెరీ వెరీ స్పెషల్ రాజమౌళి

వెరీ వెరీ స్పెషల్ రాజమౌళి

ఈ వేడుకలో దర్శకధీరుడు రాజమౌళి స్పెషల్‌గా నిలిచారు. ఈ సందర్బంగా సాహో వేదికపై మాట్లాడిన ఆయన.. అందరికీ నమస్కారం. ఏ హీరో ఫ్యాన్స్ అయినా తమ హీరో సినిమా హిట్ కావాలని కోరుకుంటారు. కానీ ప్రభాస్ సినిమాను అందరు హీరోల ఫ్యాన్స్ హిట్ కావాలని కోరుకుంటారు అన్నారు.

ప్రభాస్ ఎలాంటి వాడంటే..

ప్రభాస్ ఎలాంటి వాడంటే..

ప్రభాస్ ఏ రోజు ఎవ్వరి గురించీ చెడుగా మాట్లాడడు. అందుకే ఆయన చుట్టూ అందరిలోనూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ పాజిటివ్ వైబ్రేషనే ఈ రోజు ఇంత మంది ఫ్యాన్స్‌ని సంపాదించి పెట్టింది. ప్రభాస్ కి దూర దృష్టి ఎక్కువ. బాహుబలి సినిమా టైమ్ లోనే తన నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిందేవాడు అని రాజమౌళి చెప్పాడు.

ఓ రోజు చాలా ఎక్సయిటెడ్‌గా వచ్చి..

ఓ రోజు చాలా ఎక్సయిటెడ్‌గా వచ్చి..

ఓ రోజు చాలా ఎక్సయిటెడ్ గా నా దగ్గరకు వచ్చిన ప్రభాస్.. సుజీత్ కథ చెప్పాడని, ఆ కథ బాగా నచ్చిందని నాతో చెప్పాడు. ఓ పెద్ద సినిమా చేశాక, పెద్ద డైరెక్టర్ తో చేయాలని ఎవ్వరైనా భావిస్తారు కానీ ప్రభాస్ సాహో కథను నమ్మి ఈ సినిమా చేశాడు. అది ఆయనలో నాకు బాగా నచ్చింది అని రాజమౌళి అన్నాడు.

సుజీత్ చాలా చిన్న కుర్రోడు

సుజీత్ చాలా చిన్న కుర్రోడు

ఇక డైరెక్టర్ సుజీత్ చాలా చిన్న కుర్రోడు.. అందరూ అనుకున్నారు ఇంత పెద్ద సినిమా ఈ కుర్రోడు హ్యాండిల్ చేయగలడా? లేదా? అని. కానీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లతో అందరికీ అర్థమైపోయింది సుజీత్ క్యాపబిలిటీ ఏంటో. కంగ్రాట్స్ సుజీత్. చాలా బాగా చేశావు. ఇంత పెద్ద బడ్జెట్ సినిమాను, ప్రభాస్‌ లాంటి ఆల్ ఇండియా స్టార్‌ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. నీ భుజాలపైనే సినిమా నిలబడింది సాహో సినిమా.

సాహో సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్

సాహో సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్

సుజీత్ కథపై అందరూ నమ్మకం ఉంచారు. రిచ్ విజువల్ గ్రాఫిక్స్ తో సినిమా బాగా కుదిరింది. సాహో సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం ఖాయం. చిత్రయూనిట్ అందరికీ శుభాకాంక్షలు అని తెలుపుతూ రాజమౌళి తన ప్రసంగం ముగించారు.

సాహో మూవీ

సాహో మూవీ

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సాహో చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ సరసన శ్రధ్ధాక‌పూర్‌ నటించగా జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X