మనుషులకు ఉండే గుండె కాదు... ప్రభాస్ లాంటి ఫ్రెండ్ ఉంటే చాలు: వివి వినాయక్
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' మరో పది రోజుల్లో(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ.... నా ప్రభ, మనందరి ప్రభ.. ప్రభాస్. నేను ప్రభాస్‌ను ప్రభ అని పిలుస్తాను. ముందుగా యువి క్రియేషన్స్ నిర్మాతలు వంశీగారు, ప్రమోద్ గారి గురించి చెప్పాలి. ఈ ఇద్దరికీ మనుషులకు ఉండే గుండె కాకుండా ఇందాక అరవింద్ గారు చెప్పినట్లు సింహాలకు, పులులకు ఉండే గుండె ఉంది. నిజంగా అందరూ భయపడుతున్నారు కానీ వారి ఇద్దరికీ మాత్రం భయం లేదు. దానికి కారణం ప్రభాస్. తనకు మీరు(అభిమానులు) ఉన్నారనే ధైర్యం, దీన్ని మీరు సూపర్ హిట్ చేస్తారనే ధైర్యం. ప్రభాస్‌ను ప్రేమించే మీరందరూ సినిమాను ఎక్కడికో తీసుకెళతారనే ధైర్యం.
Photo Gallery: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్
బాహుబలి తర్వాత రాజమౌళి గారి గురించి ఎలా మాట్లాడుకున్నారో... అలా ఈ సినిమా తర్వాత సుజీత్ గురించి మాట్లాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభాస్ మీ అందరికీ ఒక హీరోగా తెలుసు. మా అందరికీ గొప్ప స్నేహితుడిగా తెలుసు. అతడి లాంటి ఫ్రెండ్ మన జీవితంలో ఉంటే మనకు ఇంకేమీ అక్కర్లేదు. అంత మంచి వ్యక్తి. అర్దరాత్రి ఫోన్ చేసినా తీస్తాడు. అతడు తన స్నేహితుడికి ఇచ్చే వ్యాల్యూకి హాట్సాఫ్.

సినిమా ట్రైలర్ చూసి పిచ్చెక్కిపోయింది. ఇపుడు సాంగ్ చూసి మరింత పిచ్చెక్కిపోయింది. ఎలా ఉన్నాడసలు... దాన్ని మాటల్లో చెప్పలేం. డాన్స్, లుక్ అదిరిపోయింది. ఇప్పటి వరకు హిందీలో ఫస్ట్ డే 42 కోట్ల షేర్ వచ్చింది. అదే హయ్యెస్ట్. ఈ సినిమాకు ఫస్ట్ డే రూ. 50 కోట్ల షేర్ వస్తుందని చెప్పుకుంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మన ప్రభాస్ అక్కడ అంత పెద్ద స్టార్ అయినందుకు సంతషంగా ఉంది అన్నారు.
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు.
నటీనటులు.. రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రధ్ధాకపూర్, జాకీషరఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు..


Click it and Unblock the Notifications











