twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాహో: శ్రీలంకన్ బ్యూటీతో ప్రభాస్‌ రొమాన్స్.. ఆ 2 కోట్లకు న్యాయం జరిగిందా..?

    |

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా సాహో గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఏ నోట విన్నా సాహో మాటలే వినిపిస్తున్నాయి. ప్యాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున దాదాపు 14000 థియేటర్స్‌లో రిలీజ్ అయింది సాహో సినిమా. తెలుగుతో తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఈ రోజే (ఆగస్టు 30) విడుదలైన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ కోణంలో శ్రీలంకన్ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్ హాట్ టాపిక్‌గా మారింది.

    Read in English: Saaho Twitter Review: Here's What Fans Feel About The Prabhas Starrer

    'బ్యాడ్ బాయ్' ప్రభాస్‌తో శ్రీలంకన్ బ్యూటీ రొమాన్స్

    'బ్యాడ్ బాయ్' ప్రభాస్‌తో శ్రీలంకన్ బ్యూటీ రొమాన్స్

    సాహో సినిమాలో 'బ్యాడ్ బాయ్' సాంగ్‌ స్పెషల్ అట్రాక్షన్ అయిందని టాక్ నడుస్తోంది. ఈ సాంగ్‌లో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో ప్రభాస్ చేసిన రొమాన్స్, డాన్స్ సూపర్ అంటున్నారు ప్రేక్షకులు. అందమైన భామల నడుమ పెద్ద తెరపై ప్రభాస్ బాగా ఆకట్టుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.

    ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. ఇప్పుడు వెండితెరపై

    ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. ఇప్పుడు వెండితెరపై

    ముందుగా ఈ వీడియో సాంగ్‌ని సాహో ప్రీ రీలీజ్ ఈవెంట్‌లో ప్రదర్శించారు. అశేష అభిమాన వర్గం నడుమ ఈ సాంగ్ సభా ప్రాంగణాన్ని హోరెత్తించింది. అదే పాట ఇప్పుడు వెండితెరపై సెన్సేషన్ అయింది. పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకుని, హాట్ హాట్‌గా కనిపిస్తున్న భామల నడుమ ప్రభాస్ ఒక్కడే ఉన్న ఈ సాంగ్‌ లో చిందులేస్తూ కనిపించడం యూత్ ఆడియన్స్‌కి మాంచి కిక్కిచ్చింది.

    ప్రభాస్‌తో చిందులేసేందుకు ఏకంగా 2 కోట్లు

    ప్రభాస్‌తో చిందులేసేందుకు ఏకంగా 2 కోట్లు

    ప్రభాస్ తో బ్యాడ్ బాయ్ సాంగ్‌లో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ చిందులేసినందుకు గాను ఏకంగా 2 కోట్లు తీసుకుందని టాక్ నడించింది. దీంతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ఆ 2 కోట్లకు న్యాయం చేసినట్లేనా? అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి జనాల్లో.

    ఒంపుసొంపులు, వయ్యారాలతో మెలికలు తిరుగుతూ

    ఒంపుసొంపులు, వయ్యారాలతో మెలికలు తిరుగుతూ

    బ్యాడ్ బాయ్ సాంగ్‌ను వెండితెరపై చూసిన ప్రేక్షకులు జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ అందచందాలకు బాగా అట్రాక్ట్ అయ్యారు ప్రేక్షకులు. పదునైన ఒంపుసొంపులు, వయ్యారాలతో మెలికలు తిరుగుతూ కనువిందు చేసిందని అంటున్నారు. ప్రభాస్ పక్కన మరింత గ్లామరస్‌గా కనిపించిందని, ఈ సాంగ్ కలర్ ఫుల్‌గా ఉందని టాక్ వినిపిస్తోంది. 2 కోట్లు మొత్తానికి తీసుకుంటే తీసుకుంది కానీ సరైన న్యాయమే చేసిందని అంటున్నారు.

    సాహో మూవీ ఇతర వివరాలు

    సాహో మూవీ ఇతర వివరాలు

    యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది 'సాహో' సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.

    English summary
    In Saaho Pre Release Event the Bad Boy song released. Saaho is a Multi-Lingual Indian Movie ft. Rebel Star Prabhas and Shraddha Kapoor. Directed by Sujeeth and Produced by Vamsi and Pramod under UV Creations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X