ఆస్ట్రియాలో హీరోయిన్‌తో కలిసి చిల్ అవుతున్న ప్రభాస్ (ఫోటోస్ వైరల్)

Recommended Video

Prabhas And Shraddha Kapoor Chill In Austria After Shoot || Filmibeat Telugu

ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పై థ్రిల్లర్ 'సాహో'. ఆగస్టులో విడుదలకు సిద్ధమైన ఈ మూవీ టాకీ పార్ట్ ఇటీవలే పూర్తయింది. పాటల చిత్రీకరణ కోసం చిత్ర బృందం ప్రస్తుతం ఆస్ట్రియాలో పర్యటిస్తోంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.

ఆస్ట్రియాలోని కొండ ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ జరుపాలని ప్లాన్ చేశారని, తాము అనుకున్న డెస్టినేషన్ రీచ్ అయ్యేందుకు ప్రభాస్, శ్రద్ధా కపూర్, మరికొందరిని 1368 మీటర్ల ఎత్తులో వెళ్లే కేబుల్ కార్లో తీసుకెళ్లాలని ప్లాన్ చేశారట. అయితే ప్రభాస్ అందుకు ఒప్పుకోలేదని టాక్.

హీరోయిన్‌తో కలిసి చిల్ అవుతున్న ప్రభాస్

హీరోయిన్‌తో కలిసి చిల్ అవుతున్న ప్రభాస్

షూటింగ్ గ్యాపులో ప్రభాస్, శ్రద్ధా కపూర్, మరికొందరు టీమ్ మెంబర్స్ ఆస్ట్రియాలో పర్యటిస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతా కలిసి షాపింగ్ వెళ్లిన సందర్భంగా ఈ ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది.

పాటల చిత్రీకరణ కోసం మాత్రమే వచ్చారు

పాటల చిత్రీకరణ కోసం మాత్రమే వచ్చారు

ఆస్ట్రియాలో రొమాంటిక్ సాంగ్స్‌తో పాటు ఇక్కడి మంచు కొండల్లో కొన్ని యాక్షన్ సీన్లు చిత్రీకరించాలని దర్శకుడు సుజీత్ ప్లాన్ చేసినట్లు రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే అలాంటిమీ ప్లాన్ చేయలేదని, ఇక్కడ కేవలం పాటల చిత్రీకరణ మాత్రమే ప్లాన్ చేసినట్లు చిత్ర బృందంలోని కొందరు సభ్యులు స్పష్టం చేశారు.

కనువిందు చేసేలా రొమాంటిక్ సాంగ్స్

కనువిందు చేసేలా రొమాంటిక్ సాంగ్స్

ఒళ్లు గగ్బురొడిచే యాక్షన్ సీన్లతో పాటు కనువిందు చేసే రొమాంటిక్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు సుజీత్ ‘సాహో' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్లలో పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సాంగ్స్ ప్రేక్షకులను రిలాక్సింగ్ మూడ్లోకి తీసుకెళ్లాలా ఉండబోతున్నాయట.

సాహో

సాహో

టీజర్ విడుదలతో 'సాహో' మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఆగస్టు 15న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రభాస్‌తో పాటు చిత్ర బృందం త్వరలో ప్రచార కార్యక్రమాల్లో సందడి చేయబోతున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X