twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి కాల్‌తో షాకయ్యా, గూస్ బంప్స్ వచ్చాయి: ‘సాహో’ మీట్లో ప్రభాస్

    |

    'బాహుబలి చిత్రం తరువాత యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం 'సాహో'. ఇండియాలో మెట్ట‌మెద‌టిగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జి తో తెరెకెక్కుతున్న ఈ చిత్రం అగ‌ష్టు 30 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు ఆకాశన్నంటేలా చేశాయి. ఆదివారం ప్రభాస్ హైదరాబాద్‌లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.

    బాహుబలి ప్రెజర్ కేవలం దర్శకుడి మీదే కాదు 'సాహో'కు పని చేస్తున్న యాక్టర్లు, టెక్నీషియన్స్ అందరిపై ఉంటుంది. అందుకే క్వాలిటీ కోసం కొంత సమయం కూడా పట్టింది. సుజీత్ వయసుకు ఇంత పెద్ద సినిమా చేయడం అమేజింగ్. సాబూ సర్, కమల్ సర్, శ్రీకర్ సర్ లాంటి పెద్ద పెద్ద టెక్నీషియన్లతో పాటు హాలీవుడ్ నుంచి, చైనా నుంచి కూడా టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేశారని ప్రభాస్ తెలిపారు.

    సుజీత్ బాగా హ్యాండిల్ చేశాడు

    సుజీత్ బాగా హ్యాండిల్ చేశాడు

    సుజీత్ తన సెకండ్ సినిమాకే ఇంత పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. కానీ అతడిలో ఎలాంటి ఒత్తిడి కనిపించలేదు. మేమైనా అప్పుడప్పుడు ప్రెజర్‌కు గురయ్యాం కానీ సుజీత్ సెట్స్ మీద కోపానికి గురి కావడం ఎప్పుడూ కనిపించలేదని ప్రభాస్ తెలిపారు.

    అప్పుడే సుజీత్ మీద కాన్ఫిడెంట్ వచ్చింది

    అప్పుడే సుజీత్ మీద కాన్ఫిడెంట్ వచ్చింది

    ఫస్ట్ డే షూట్ చాలా కాంప్లికేటెడ్ సీన్. ఒకేఒక్క సీన్లో ఐదు డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. సినిమాలో అది ఐదారు సార్లు వస్తుంది. యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దర్శకుడు, స్టోరీ రైటర్‌కు కూడా చాలా డిఫికల్ట్ సీన్. దాంతోనే మొదలు పెట్టాం. దాన్ని రీ షూట్ చేయలేదు, కరెక్షన్ కూడా లేదు. కథలో 8 లేయర్లు ఉంటాయి. అ సీన్ చేయడం చాలా కష్టం. దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయడంతో సుజీత్ మీద చాలా కాన్ఫిడెంట్ అనిపించింది.

    బాహుబలి అభిమానులను మెప్పిస్తే చాలు

    బాహుబలి అభిమానులను మెప్పిస్తే చాలు

    బాహుబలి తర్వాత వస్తున్న మూవీ కావడంతో అందరిలోనూ అంచనాలు భారీగా ఉంటాయి. వారిని మెప్పించడానికే మేము రాత్రింభవళ్లు కష్టపడ్డాం. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బాద్ షా కావాలనో, మరేదో కావాలనో ఆశలేదు. ఈ సినిమా బాహుబలి అభిమానులను మెప్పిస్తే చాలు, మెప్పిస్తుందనే నమ్మకం ఉందని ప్రభాస్ తెలిపారు.

    సిక్సర్ కొట్టడమే తెలుసు, డిఫెన్స్ తెలియదు

    సిక్సర్ కొట్టడమే తెలుసు, డిఫెన్స్ తెలియదు

    ట్రైలర్లో కొడితే సిక్సర్ కొట్టాలి అనే డైలాగ్ ఉంది కదా... మీ జీవితంలో ఎప్పుడైనా సిక్సర్ కొట్టారా? అనే ప్రశ్నకు ప్రభాస్ స్పందిస్తూ ‘నేను బ్యాటింగ్ వెళ్లినపుడు లాగి కొట్టడమే. డిఫెన్స్ ఆడటం రాదు. తగిలితే సిక్సర్ వెళ్లాల్సిందే' అని సమాధానం ఇచ్చారు.

    ‘సాహో'లో ప్రభాస్‌తో అవకాశం రావడంపై శ్రద్ధా కపూర్

    ‘సాహో'లో ప్రభాస్‌తో అవకాశం రావడంపై శ్రద్ధా కపూర్

    బాహుబలి తర్వాత చాలా మంది హీరోయిన్లు ప్రభాస్‌తో సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నారు. మీకు ‘సాహో'లో అవకాశం రావడంపై ఎలా ఫీలవుతున్నారు అనే ప్రశ్నకు శ్రద్దా కపూర్ స్పందిస్తూ... స్టోరీ విన్నవెంటనే వావ్ అనిపించింది. అందులో ప్రభాస్ కూడా ఉండటంతో డబల్ హ్యాపీ, దీంతో పాటు నాకు చాలా మంచి పాత్ర దక్కింది... ఇది త్రిపుల్ హ్యాపీ నెస్, ఇదే కాకుండా ఇది బహుభాషా చిత్రం కావడంతో ఇలాంటి సినిమాలో భాగం కావడం ఎంతో గొప్పగా అనిపించింది. ప్రభాస్ లాంటి జెన్యూన్ పర్సన్‌తో పని చేయడం మరింత ఆనందంగా అనిపించిందని తెలిపారు.

    హిందీ డబ్బింగ్ అలా పూర్తి చేశా

    హిందీ డబ్బింగ్ అలా పూర్తి చేశా

    ఈ సినిమాకు జేమ్స్ బాండ్ మూవీ స్పూర్తి ఏదైనా ఉందా? అనే ప్రశ్నకు ప్రభాస్ స్పందిస్తూ... అలాంటిదేమీ లేదన్నారు. హిందీ రాయడం వచ్చు, చదవడం వచ్చు. కానీ ఇంట్లో ఎప్పుడూ మాట్లాడం. మనది హైదరాబాద్ కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే మాట్లాడుతూ ఉంటాం. అయితే డబ్బింగ్‌ చెబుతుండగా కాస్త ఇబ్బంది అనిపించింది. మాస్టర్ సహాయంతో డబ్బింగ్ చెప్పాను.

    ఆ సీన్లు చేస్తుంటే మాకే భయం వేసింది

    ఆ సీన్లు చేస్తుంటే మాకే భయం వేసింది

    ఈ సినిమాలో కొత్త యాక్షన్ ట్రై చేశాం. ట్రైలర్లో చూసిన ట్రక్ సీన్ సీజీ కాదు, రియల్ ట్రక్ రియల్ స్పీడులో టర్న్ అవుతూ ఉంటుంది. ట్రాన్స్ ఫార్మర్స్ చిత్రానికి చేసిన ట్రక్ డ్రైవర్‌ను స్పషల్‌గా తెప్పించాం. అంత స్పీడ్లో ట్రక్ వెళుతుంటే ఎలా కంట్రోల్ చేయడం అనేది చూస్తుంటే మాకే భయం వేసింది.

    జిబ్రాన్ అదరగొట్టారు

    జిబ్రాన్ అదరగొట్టారు

    జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చేశాడు. టీజర్ వచ్చినపుడు విని షాకయ్యాం. దాదాపు 80 లేయర్లు చేశాడు. అందుకే అంతబాగా సౌండ్ వచ్చింది. ఈ సినిమాలో ఆర్ఆర్ చాలా కీలకంగా ఉంటుంది.

    నేను ప్రమోద్ కలిసి పెరిగాం

    నేను ప్రమోద్ కలిసి పెరిగాం

    నేను, నిర్మాత ప్రమోద్ కలిసి పెరిగాం. నాకు రెండేళ్ల వయసు నుంచి తెలుసు. ప్రమోద్‌తో కలిసి ఎల్‌కెజి గన్నవరంలో చదువుకున్నా. ప్రమోద్ విజయవాడలో ఉండేవాడు. వంశీ నాకు స్కూల్ ఫ్రెండ్. మేమంతా ఒక ఫ్యామిలీ. అందుకే కాస్త టెన్షన్ ఎక్కువగా ఉంటుంది.

    భారీ బడ్జెట్ చిత్రాలు అనవసరమైన టెన్షన్

    భారీ బడ్జెట్ చిత్రాలు అనవసరమైన టెన్షన్

    భారీ బడ్జెట్ చిత్రాలు చేయాలని ఏమీ లేదు. క్వాలిటీ కోసం అలా బడ్జెట్ పెరిగిపోయింది. వందల కోట్లు అంటే అనవసరమైన స్ట్రెస్. అందుకే ఇలాంటి పెద్ద సినిమాలు చేయాలని లేదు.

    చిరంజీవిగారి నుంచి ఫోన్ రాగానే షాకయ్యా

    చిరంజీవిగారి నుంచి ఫోన్ రాగానే షాకయ్యా

    ట్రైలర్ చూసిన తర్వాత రాజమౌళిగారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆయన ట్వీట్ చేయకపోయినా నాతో బావుందని చెప్పారు. ట్రైలర్ చూసి చిరంజీవిగారు మెసేజ్ చేయడంతో షాకయ్యాను. గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన నుంచి మెసేజ్ రాగానే నేను ఫోన్ చేశాను. బాలీవుడ్ పెద్ద పెద్ద స్టార్ల నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయని ప్రభాస్ తెలిపారు.

    English summary
    Prabhas revealed interesting facts at Saaho Team Press Meet. Saaho is an upcoming 2019 Indian action thriller film written and directed by Sujeeth, produced by UV Creations and T-Series. The film stars Prabhas and Shraddha Kapoor, and has been shot simultaneously in Hindi, Tamil and Telugu Marking Prabhas' debut in Hindi and Shraddha Kapoor's debut in South Indian cinema, the film has been produced with a budget of ₹300 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X