25 మిలియన్.... ఆరు గంటల్లో ‘సాహో’ టీజర్ సంచలనం!
'సాహో' టీజర్ ఇంటర్నెట్లో సంచలనాలు నమోదు చేస్తూ దూసుకెళుతోంది. విడుదలైన ఆరు గంటల్లోనే 25 మిలియన్ డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో కలిపి ఈ ఫీట్ సాధించింది.
ఈ యాక్షన్ మూవీ కోసం ఆలిండియా వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే స్పష్టమవుతోంది. టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించిన హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ బాగా హైలెట్ అయ్యాయి.

రూ. 300 కోట్ల బడ్జెట్‌తో యూవి క్రియేషన్స్ సంస్థ 'సాహో' చిత్రాన్ని నిర్మించింది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నెక్ట్స్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆ అంచనాలను అందుకునే విధంగా, ప్యాన్ ఇండియా స్థాయిలో, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
టీజర్ విడుదలతో 'సాహో' మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. జూన్ 14 నుంచి ఇండియా వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఆయా భాషల్లో ఈ టీజర్ ప్రదర్శించబోతున్నారు. ప్రభాస్‌తో పాటు చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో సందడి చేయబోతున్నారు.
ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











