Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘సాహో’ అబుదాబి షెడ్యూల్ పూర్తి, నెక్ట్స్ హైదరాబాద్లో..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'సాహో' అబుదాబిలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో దాదాపు 60 రోజుల పాటు యాక్షన్ స్టంట్స్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఇండియన్ సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ చూడని మెగా యాక్షన్ సీన్లు ఈ చిత్రంలో చూడబోతున్నాం. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్, ట్రాన్స్ఫార్మర్స్ లాంటి సినిమాలకు పని చేసి కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ఈ సీన్లు చిత్రీకరించారు.
'సాహో' సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కీలకంగా ఉండబోతున్నాయి. అందుకే 60 రోజుల పాటు కోట్లాది రూపాయల ఖర్చుతో వీటిని చిత్రీకరించారు. సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం ఈ సీన్ల కోసమే కేటాయించడం గమనార్హం.
అబుదాబి షెడ్యూల్ పూర్తి కావడంతో సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ పూర్తయినట్లయింది. మూడో షెడ్యూల్ హైదరాబాద్లో జులై 11 నుండి మొదలవుతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.