twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహో’ అబుదాబి షెడ్యూల్ పూర్తి, నెక్ట్స్ హైదరాబాద్‌లో..

    By Bojja Kumar
    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'సాహో' అబుదాబిలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో దాదాపు 60 రోజుల పాటు యాక్షన్ స్టంట్స్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఇండియన్ సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ చూడని మెగా యాక్షన్ సీన్లు ఈ చిత్రంలో చూడబోతున్నాం. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్, ట్రాన్స్‌ఫార్మర్స్ లాంటి సినిమాలకు పని చేసి కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ఈ సీన్లు చిత్రీకరించారు.

    'సాహో' సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కీలకంగా ఉండబోతున్నాయి. అందుకే 60 రోజుల పాటు కోట్లాది రూపాయల ఖర్చుతో వీటిని చిత్రీకరించారు. సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం ఈ సీన్ల కోసమే కేటాయించడం గమనార్హం.

    Saaho wraps up Abu Dhabi schedule

    అబుదాబి షెడ్యూల్ పూర్తి కావడంతో సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ పూర్తయినట్లయింది. మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో జులై 11 నుండి మొదలవుతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

    యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    The team of Prabhas starrer ‘Saaho’ has wrapped up the lengthy major action schedule in Abu Dhabi. “Wrapped up the second schedule in Abu Dhabi. The third schedule begins in Hyderabad on 11th July,” the production house tweeted. The film is being produced by UV Creations with huge budget.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X