సాక్ష్యం మూవీ విడుదల తేదీ ఖరారు.. ఈసారైనా బెల్లం కొండ అబ్బాయికి!
కమర్షియల్ చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నారు బెల్లం కొండా శ్రీనివాస్. ఈ హీరో చేసిన చిత్రాలన్నీ కమర్షియల్ చిత్రాలే. సాయి శ్రీనివాస్ తాజగా నటిస్తున్న చిత్రం సాక్ష్యం. ఈ చిత్రంతో విజయం సాధించగలననే ధీమాతో ఈ యువ హీరో ఉన్నాడు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ లో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాక్ష్యం చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఈ చిత్రం భారీ స్థాయిలో యూఎస్, వారణాసి , దుబాయ్ వంటి లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో చిత్ర యూనిట్ విడుదల తేదీ ప్రకటించారు. జూన్ 14 న ప్రేక్షకుల ముందు ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు.

హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకు కమర్షియల్ చిత్రాలని తెరకెక్కించిన శ్రీవాస్.. సాక్ష్యం కథని హిందూ ఆధ్యాతిమిక నేపథ్యంలో రూపొందించినట్లు తెలుస్తోంది. నవల ఆధారంగా ఈ చిత్ర కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది.


Click it and Unblock the Notifications











