twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒళ్లు గగుర్బొడిచే సీన్లతో ‘సాక్ష్యం’ ట్రైలర్

    By Bojja Kumar
    |

    బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'సాక్ష్యం' . అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మాత‌గా.. శ్రీవాస్ ద‌ర్శ‌త‌క్వంలో ఈ మూవీ తెరకెక్కించారు. ఫుల్లీ లోడెడ్ కమర్షియల్ ఎంటర్టెనర్‌‌గా తీసిన చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందించారు. ఆడియో ఆవిష్క‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. జులై 27న సినిమాను విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ అంచనాలు మరింత పెంచింది.

    ట్రైలర్లోనే భారీతనం ఉట్టిపడుతోంది

    జయాపజయాల సంగతి పక్కన పెడితే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటి వరకు చేసిన అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక చిత్రాలన్నీ భారీ చిత్రాలే. తాజాగా ‘సాక్ష్యం' మూవీ కూడా అతడి గత చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రాండ్‌గా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. సినిమాపై అంచనాలు మరింత పెంచేలా ట్రైలర్ కట్ చేశారు.

    భయంకరమైన పాత్రలో జగపతి బాబు

    భయంకరమైన పాత్రలో జగపతి బాబు

    జగపతి బాబు ఈమూవీలో భయంకరమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ‘మూగ జీవాలు సాక్ష్యం చెప్పలేకపోయినా.. సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. ఈ సంఘటన చూసిన ఏ జీవాలు ప్రాణాలతో ఉండకూడదు' అంటూ జగపతిబాబు అండ్ గ్యాంగ్ చేసే దారుణాలు ఒళ్లుగగుర్బొడిచే విధంగా ఉన్నాయి.

    డాన్సులు, ఫైట్లు కేక పుట్టించే స్థాయిలో

    డాన్సులు, ఫైట్లు కేక పుట్టించే స్థాయిలో

    బెల్లంకొండ శ్రీనివాస్‌లో ఉండే ప్లస్ పాయింట్ యాక్షన్ సీన్లు, డాన్సుల్లో పెద్ద హీరోలను మరిపించే స్థాయిలో చేయడమే. ‘సాక్ష్యం' మూవీలో కూడా ఈ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు స్పష్టమవుతోంది.

    పంచ‌భూతాల ఐడియాతో...

    పంచ‌భూతాల ఐడియాతో...

    దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ ``నేను మాట్లాడాల్సిందంతా నా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌, నా పంచ‌భూతాల పాట మాట్లాడేసింది. నేను ఇంత‌కు ముందు ఐదు సినిమాలు చేసి, ఆ ఎక్స్ పీరియ‌న్స్ తో ఆరో సినిమాగా ఈ సినిమా చేశాను. ర‌క‌ర‌కాల కాన్సెప్ట్ లు ఆలోచించి, కొత్త క‌థ‌లు చెప్పినా ఆడియ‌న్స్ అర్థం చేసుకునే స్థాయికి వ‌చ్చేశార‌ని గ్ర‌హించి ఫైన‌ల్‌గా ఈ క‌థ‌ను చెప్పాం. పంచ‌భూతాల ఐడియా రాగానే, పంచ‌భూతాల స‌పోర్ట్ తోనే ఈ సినిమా అలా జ‌రిగింది. కొన్ని ఐడియాలు ఎలా వ‌చ్చాయో నాకే ఆశ్చ‌ర్యం వేస్తుంది. అవి ఎప్పుడూ నేను చూసిన‌వి కావు, ఎక్క‌డా విన్న‌వి కావు. మంచి క‌థ‌ను, మంచి విష‌యాన్ని జ‌నాల్లోకి చెప్పాల‌నే ఆలోచ‌న నాకు ఎప్పుడైతే వ‌చ్చిందో అప్పుడే పంచ‌భూతాలు కూడా నాతో ఈ ప‌నులు చేయించాయి.. అంటూ వ్యాఖ్యానించారు.

    English summary
    Watch here the theatrical trailer of #Saakshyam. Starring Bellamkonda Srinivas & Pooja Hegde, Music composed by #Harshavardhan Rameswar, Directed by Sriwaasand Produced by Abhishek Nama under Abhishek Pictures.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X