సాక్ష్యం: టెక్నికల్ సమస్యతో ఆగిన షోలు... ఓవర్సీస్ రిపోర్ట్స్ యావరేజ్!
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'సాక్ష్యం'. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మాతగా శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో టెర్రిఫిక్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత చిత్రం 'జయ జానకి నాయక' బాక్సాఫీసు వద్ద ఫర్వలేదనిపించింది. అయితే దాన్ని మించిపోయే యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో 'సాక్ష్యం' మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.
తెలుగు రాష్ట్రాల్లో 'సాక్ష్యం’ మూవీ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు రద్దయ్యాయి. టెక్నికల్ ఇష్యూ అని చెబుతున్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతల మధ్య ఏదో వివాదం నడుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు.
ఫస్టాఫ్ ఓకే, సెకండాఫ్ బోరింగ్
సాక్ష్యం మూవీ ఫస్ట్ ఓకే అనేలా ఉందని, అయిత సెకండాఫ్ బోరింగ్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆశించిన స్థాయిలోలేదు
సాక్ష్యం మూవీ ఆశించిన స్థాయిలోలేదని మరికొందరు ట్వీట్ చేశారు.
Recommended Video

ప్రసాద్స్‌లో ఉదయం షోలు రద్దు
టెక్నికల్ ఇష్యూల వల్ల ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్లో సాక్ష్యం షోలు రద్దయ్యాయి.

యావరేజ్ రిపోర్ట్స్
యూఎస్ఏలో పలు చోట్ల ప్రీమియర్స్ ప్రదర్శించారు. ప్రేక్షకుల నుండి యావరేజ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











