సారాయి వీర్రాజు పుట్టుక

ఈ విషయమై దర్శకుడు కన్నన్ మాట్లాడుతూ అజయ్ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. కామెడి, వ్యంగ్యం, మొండితనం, ధైర్యం, సెన్సిటివ్ నెస్ కలబోతగా ఉంటుంది. నిజజీవితంలో మనకు పరిచయమున్నట్లే ఉంటుంది. అలాగే మిగతా పాత్రల్లో కూడా న్యాచురాలిటి తీసుకొచ్చేందుకు దాదాపు ఎనభై మందిని సెలెక్టు చేసి ట్రైనింగ్ ఇచ్చాం అంటున్నారు.
విశాలాక్ష్మి అనే నూతన నిర్మాణ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 1980ల నాటి కాలంలో జరిగే కథగా ఈ చిత్రం నడుస్తుంది. ఇందులో అజయ్ సారాయి వీర్రాజు అనే పాత్రను పోషిస్తున్నాడు. ఇక అతని ప్రక్కన రమ్య అనే మళయాళ అమ్మాయి హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ అమ్మాయే కాకుండా మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఈ చిత్రంలో ఉంటారని సమాచారం. డిసెంబర్ చివరి నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. కన్నన్ తమిళుడైనా రాజమౌళి శిష్యుడు కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











