అంత అవమానాన్ని తట్టుకోలేక.. ఇంటర్వ్యూలోనే ఏడ్చేసిన హీరోయిన్..

Recommended Video

అంత అవమానాన్ని తట్టుకోలేక.. ఇంటర్వ్యూలోనే ఏడ్చేసిన హీరోయిన్..!

కేవలం ముస్లిం అన్న కారణంగా నిత్యం అనుమానపు చూపుల్ని ఎదుర్కోవాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. ఇక పాకిస్తాన్ ముస్లింల పరిస్థితి మరింత దయనీయం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా.. తమను అనుమానాస్పదంగా చూడటం వాళ్లు జీర్ణించుకోలేని విషయం.

పాక్ పై ఉగ్రవాద ఆరోపణలు పాలకులకు సంబంధించిన విషయమే అయినా.. సామాన్యులకు మాత్రం నిందలు తప్పడం లేదు. ఇలాంటి చేదు అనుభవాన్ని తాను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని నటి సబా కమర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

'హిందీ మీడియం':

'హిందీ మీడియం':

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌తో కలిసి గతేడాది 'హిందీ మీడియం' సినిమాలో నటించారు సబా కమర్. ఈ సినిమా షూటింగ్ కోసం జార్జియాలోని తబ్లిసికి వెళ్లినప్పుడు అక్కడి అధికారులు తన పట్ల వ్యవహరించిన తీరుకు తాను నిర్ఘాంతపోయినట్లు సబా కమర్ తెలిపారు.

ఎయిర్‌పోర్ట్ తనిఖీలు..:

ఎయిర్‌పోర్ట్ తనిఖీలు..:

పాకిస్థాన్‌లో ఉండి మనం పాకిస్థాన్‌ జిందాబాద్‌. పాకిస్థాన్‌ జై అంటూ ఎన్నో నినాదాలు చేస్తాం. కానీ మనం బయటకు వెళ్లినప్పుడు మన పట్ల జరిగే తనిఖీలు ఎంత దారుణంగా ఉంటాయో మాటల్లో చెప్పలేను. అవమానకర రీతిలో ఆ తనిఖీలు ఉంటాయి' అని సబా కమర్ ఆవేదన వ్యక్తం చేశారు.

అందరూ వెళ్లిపోయారు.. నేను మాత్రం:

అందరూ వెళ్లిపోయారు.. నేను మాత్రం:

'భారతీయ చిత్రయూనిట్‌తో షూటింగ్‌ కోసం మేం తబ్లిసీ వెళ్లినప్పుడు ఏం జరిగిందో నాకు ఇప్పటికీ గుర్తుంది.చిత్రయూనిట్‌ మొత్తం ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లిపోయింది. నన్ను మాత్రం అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పూర్తిగా తనిఖీలు చేశాకే అక్కడినుంచి పంపించారు.

కేవలం పాకిస్తానీ అన్న కారణంతో..:

కేవలం పాకిస్తానీ అన్న కారణంతో..:

'కేవలం పాకిస్తానీ అన్న కారణంతోనే అక్కడి అధికారులు నన్ను ఇంతలా అవమానించారు. బయట మనకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అన్న విషయం ఆరోజే నాకు అర్థమైంది' అని చెబుతూ సబా కమర్ కన్నీటి పర్యంతమయ్యారు.

వీడియో వైరల్.. :

వీడియో వైరల్.. :


బయటి దేశాల్లో పాకీస్తానీలకు ఎదురవుతున్న అవమానాలపై సబా కమర్ ఉద్వేగంగా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది పాకీస్తానీలు సబా కమర్ లేవనెత్తిన అంశాలపై చర్చించుకుంటున్నారు. కాగా, బాలీవుడ్ లో ఆమె నటించిన 'హిందీ మీడియం' సినిమా మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X