జీవిత రాజశేఖర్ పడ్డ కష్టాలు నాకు తెలుసు: సబితా ఇంద్రారెడ్డి
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ 'ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని జీవిత రాజశేఖర్ 'మహంకాళి' చిత్రాన్ని పూర్తిచేశారు. ఆమెపడ్డ కష్టాలు నాకు తెలుసు. రాజశేఖర్‌గారు గతంలో ఎన్నో పోలీస్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రతి పోలీస్ అధికారి జీవితంలో 99శాతం విజయవంతమైన సంఘటనలే వుంటాయి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి 'మహంకాళి' స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను' అన్నారు.
అలాగే ''ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో సినిమాల పాత్ర ఎంతో కీలకమైంది. సమాజానికి ఉపయోగపడే చిత్రాలు మరిన్ని రావాలి''న్నారు రాష్ట్ర హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో 'మహంకాళి' గీతాల్ని, ప్రచార చిత్రాల్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ చిత్రంలో రాజశేఖర్, మధురిమ జంటగా నటించారు. జీవిత దర్శకత్వం వహించారు.
''గతంలో చేసిన పోలీస్ పాత్రల కంటే భిన్నంగా ఉంటుందీ పాత్ర. ఆ గొప్పదనం అంతా జీవితకే దక్కుతుంది. మార్చి 2న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. ''అంకుశం' 'తలంబ్రాలు' చిత్రాల్ని అవకాశం వుంటే ఇప్పటి యంగ్ హీరోలతో తెరకెక్కించాలని వుంది''అన్నారు రాజశేఖర్. ఈ కార్యక్రమంలో శ్యాంప్రసాద్‌రెడ్డి, పోకూరి బాబూరావు, రఘు, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. 'మహంకాళి' చిత్రాన్ని జీవిత అద్భుతంగా తీర్చిదిద్దారు. 'అంకుశం' స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను' అన్నారు.
మార్చి 2న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు జీవిత తెలిపారు. ఈ కార్యక్షికమంలో శ్యాంప్రసాద్‌డ్డి, పోకూరి బాబురావు, మల్టీడైమన్షన్ వాసు, తమ్మాడ్డి భరద్వాజ పాల్గొన్నారు. మధురిమ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: డా॥ రాజశేఖర్, కృష్ణమోహన్, కెమెరా: మధు ఎ నాయుడు, ఫైట్స్: కణల్ కన్నన్, మార్షల్ రమణ, నిర్మాతలు:యేలూరి సురేంవూదడ్డి, పరంధామడ్డి, కథ- స్కీన్‌ప్లే-దర్శకత్వం: జీవిత రాజశేఖర్.


Click it and Unblock the Notifications












