twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాహో కోసం మరో భారీ సెట్.. రామోజీ సిటీలో కళ్లు చెదిరేలా సముద్రంపై వంతెన

    |

    తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న సాహో చిత్రం భారీ హంగులతో రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. దుబాయ్‌లో సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసి ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే యాక్షన్ సీన్లు చిత్రీకరించిన విషయం తెలిసిందే. 40వ దశకంలోని పరిస్థితులు, స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన కథా నేపథ్యంతో సాహో రూపొందుతుండటం వల్ల భారీగా సెట్లు వేసి చిత్రీకరిస్తున్నారు.

    ప్రస్తుతం సాహో చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నది. ఈ చిత్రం కోసం ముంబై సెటప్‌ను సెట్‌గా వేశారు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వినూత్నంగా బాంద్రా, వర్లీ సముద్రంపై ఉండే రహదారి సెట్‌కు రూపకల్పన చేశారు. బాంద్రా, వర్లీ సముద్ర వంతెనపై యాక్షన్ సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం మరోసారి భారీ బడ్జెట్‌తో సెట్‌ను వేయడం గమనార్హం.

    Sabu Cyril has recreated Bandra,Worli sea link

    ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు శ్రద్ధాకపూర్, జాకీ ష్రాఫ్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్‌తోపాటు తమిళ హీరో అరుణ్ విజయ్‌ కూడా నటిస్తున్నాడు. రన్ రాజా రన్ చిత్రం దర్శకుడు సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతున్నది.

    English summary
    UV Creations is also looking at the same date to release their film, which is being made as a trilingual in Tamil, Telugu, and Hindi. The team is currently shooting in Ramoji Film City, Hyderabad. Art director Sabu Cyril has recreated the eye-popping Bandra-Worli sea link for an action sequence for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X