twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి సెట్టింగ్స్: సాబు సిరిల్ చెప్పిన విషయాలు (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి'. తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ సెట్టింగులు, రాజుల కాలం నాటి ఆయుధాలు, యుద్ధాలలో ఈ సినిమాను డిఫరెంటుగా తెరకెక్కిస్తున్నారు.

    సినిమా కోసం రెండు వేల ఏళ్ల నాటి పరిస్థితులు ప్రతిభింబించేలా సెట్సింగ్స్, అందుకు సంబంధించిన వస్తువులు, ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులు, యుద్ధ సామాగ్రి ఇలా ప్రతి ఒకటి ప్రత్యేకంగా తయారు చేయాలి. రాజమౌళి ఆలోచనలకు తగిన విధంగా వాటికి రూపునిచ్చింది....ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, నాలుగు జాతీయ పురస్కారాలు అందుకున్న సాబు సిరిల్.

    తాజాగా ఆయన ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన విషయాలు, బాహుబలి సినిమా కోసం ఆయన తన టీంతో కలిసి రూపునిచ్చిన వస్తువులు స్లైడ్ షోలో...

    బాహుబలి

    బాహుబలి


    ఒక కళా దర్శకుడిలో ఎంత ప్రతిభైనా ఉండవచ్చు. కానీ దాన్ని బయట పెట్టే అవకాశం రావాలంటే బాహుబలి లాంటి సినిమా రావాలని సాబు సరిల్ చెప్పుకొచ్చరు.

    మూడున్నరేళ్లు

    మూడున్నరేళ్లు


    బాహుబలి సినిమా కోసం ఇప్పికే మూడున్నరేళ్ల సమయం వెచ్చించాము. సీక్వెల్ కూడా ఉంది కాబట్టి ఈ సమయం మరింత పెరుగుతుంది అన్నారు. పనిపైనే దృష్టి పెట్టడం వల్ల సమయం, కష్టం తెలియకుండా పోయాయి అన్నారు.

    హాల్లో పుట్టింది

    హాల్లో పుట్టింది


    బాహుబలి సినిమా హాల్లో పుట్టిన కథ. దీనికి ఎలాంటి రెఫరెన్సులు లేవు. 2వేల సంవత్సరాల కిందటి వాతావరణాన్ని ప్రతిభింభిస్తూ సాగుతుంది. దీని కోసం ప్రతీది కొత్తగా సృష్టించాల్సిందే అన్నారు.

    500 లొకేషన్లు...

    500 లొకేషన్లు...


    బాహుబలి సినిమా చిత్రీకరణ కోసం 500 లొకేషన్లు పరిశీలించినట్లు సాబు సిరిల్ తెలిపారు.

    వేలాది స్కెచ్ లు

    వేలాది స్కెచ్ లు


    బాహుబలి సినిమా కోసం 12 వేల స్కెచ్ లు వేసాం. ఆయనకి చూపించడానికి ముందు మాకు మేము వేసుకున్నవి కలిపితే 20 వేలు దాటుతుంది అన్నారు. పాత్రల రూపురేఖల కోసం ప్రత్యేకమైన స్కెచ్ లు వేసాం. వీటికి ఏడాది సమయం పట్టిందన్నారు సాబు సిరిల్.

    బాహుబలి కోసం మహిష్మతి రాజ్యం

    బాహుబలి కోసం మహిష్మతి రాజ్యం


    బాహుబలి కోసం మేం సృష్టించిన మహిష్మతి రాజ్యం, రాజభవనం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే...చూడ్డానికి రెండు కళ్లు చాలవేమో అనేంత పెద్దగా ఉంటాయి.

    భారీ సెట్టింగ్స్

    భారీ సెట్టింగ్స్


    మామూలుగా ఎంత పెద్ద సెట్టింగ్స్ అయినా 24 అడుగుల ఎత్తు, 10/10 పిల్లర్స్ వేసి నిర్మాణం చేపడుతుంటాం. కానీ మహిష్మతి కోసం 45 అడుగుల ఎత్తుతో పిల్లర్స్ వేసి సెట్స్ తీర్చి దిద్దాం. విజువల్ ఎఫెక్ట్స్ తో వాటి పరిధి కొన్ని రెట్లు విస్తృతం అవుతాయి అన్నారు సాబు సిరిల్.

    మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ తో సాధ్యం కాదు

    మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ తో సాధ్యం కాదు


    అన్నీ విజువల్ ఎఫెక్ట్స్ లో చూపించడం సాధ్యం కాదు అని సాబు సిరిల్ తెలిపారు.

    భల్లాలదేవ విగ్రహం

    భల్లాలదేవ విగ్రహం


    బాహుబలి సినిమాలో భల్లాలదేవ విగ్రహాన్ని 200 మంది నెల రోజుల పాటు పని చేసి తీర్చి దిద్దినట్లు సాబు సిరిల్ తెలిపారు. తల భాగం ఒక్కటే 28 అడుగుల ఎత్తు ఉంటుందన్నారు. విగ్రహం మొత్తం ఎత్తు 100 అడుగులు.

    నిలబెట్టడం కష్టమైంది

    నిలబెట్టడం కష్టమైంది


    100 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టడం చాలా కష్టమైంది.న అందుకోసం 4 భారీ క్రేన్లు, పెద్ద పెద్ద బుల్డోజర్లు వాడాం. విగ్రహ తయారీకి 3డి ప్రింటింగ్ సహాయం తీసుకున్నాం అన్నారు.

    భారీగా ఖర్చు పెట్టారు

    భారీగా ఖర్చు పెట్టారు


    సెట్స్ తీర్చి దిద్దేప్పుడు ఇంత ఖర్చు అవుతుందని అటుఇటుగా చెబుతాం. తర్వాత వ్యవహారాలన్నీ నిర్మాతే చూసుకుంటాడు. సెట్స్ కోసం కాంట్రాక్టు కుదుర్చుకోవడం లాంటివి చేయను. మా ప్రతిబను నమ్మి నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు అన్నారు.

    ప్రతి విషయాన్ని డబ్బుతో పోల్చలేం

    ప్రతి విషయాన్ని డబ్బుతో పోల్చలేం


    నేను ఖరీదైన సాంకేతిక నిపుణుడిని అనుకుంటే పొరపాటే. తక్కువ వ్యయంతో పని చేస్తాననే నిర్మాతలు నన్ను సంప్రదిస్తారు. ఏడాదికి మూడు సినిమాలు చేస్తాం. బాహుబలి ఒక్కటే నాకు 11 సినిమాలతో సమానం. మరి అంత పారితోషికం నాకు లభించదు కదా. ఇలాంటి రంగంలో ప్రతి విషయాన్ని డబ్బుతో పోల్చలేం అన్నారు సాబు సిరిల్.

    రాజమౌళి గురించి

    రాజమౌళి గురించి


    రాజమౌళిలో ఎప్పుడూ సినిమా ఆవహించి ఉంటుంది. ఆ సినిమా పూర్తయ్యే వరకు మనసులోకి మరో ఆలోచన రానివ్వడు అన్నారు.

    దర్శకత్వం వైపు

    దర్శకత్వం వైపు


    మళయాలంలో ఓ సినిమా చేయాలనుకున్నాను. ప్రస్తుతానికైతే దర్శకత్వం గురించి ఆలోచించడం లేదు అన్నారు సాబు సిరిల్.

    బాహుబలి 2

    బాహుబలి 2


    బాహుబలి తర్వాత....బాహుబలి 2 తో పాటు అజయ్ దేవగన్ శివం చిత్రానికి పని చేయబోతున్నట్లు సాబు సరిల్ తెలిపారు.

    రామోజీ ఫిల్మ్ సిటీ

    రామోజీ ఫిల్మ్ సిటీ


    రామోజీ ఫిల్మ్ సిటీ ఉండటం వల్లనే బాహుబలి సినిమా సాధ్యమైందని, వందల ఎకరాల విస్తీర్ణం ఉండటం వల్ల యుద్ద సన్నివేశాలు, సెట్టింగ్స్ ఇలా అన్ని సాధ్యమైనట్లు తెలిపారు సాబు సిరిల్.

    యంత్రాలతో నడిచే గుర్రాలు, ఏనుగులు

    యంత్రాలతో నడిచే గుర్రాలు, ఏనుగులు


    బాహుబలి సినిమా కోసం యంత్రాలతో నడిచే గుర్రాలు, ఏనుగులు, అడవి దున్నలు, పాముల్ని కూడా తయారు చేసినట్లు సాబు సిరిల్ తెలిపారు.

    వార్ మెషీన్లు

    వార్ మెషీన్లు


    చిత్రీకరణ కోసం 25, 30 అడుగుల ఎత్తున్న వార్ మెషీన్లు తయీరు చేసి చిత్రీకరణ కోసం వాడినట్లు సాబు సరిల్ తెలిపారు.

    అది కూడా...

    అది కూడా...


    బాహుబలి ఫస్ట్ లుక్ పోస్టర్లో కనిపించే పిల్లాడి బొమ్మ కూడా సాబు సిరిల్ తయారు చేసిందే.

    20 వేల ఆయుధాలు

    20 వేల ఆయుధాలు


    బాహుబలి సినిమా కోసం 20 వేల ఆయుధాలు తయారు చేసాం. ఇన్ని ఆయుధాలకు చేత్తో రంగులు వేసామని సాబు సిరిల్ తెలిపారు.

    చిన్న కర్మాగారం

    చిన్న కర్మాగారం


    ఆయుధాల తయారీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో చిన్నపాటి కర్మాగారానే ఏర్పాటు చేసారట.

    కార్బన్ ఫైబర్ తో

    కార్బన్ ఫైబర్ తో


    బాహుబలి చిత్రానికి సంబంధించిన ఆయుదాలు కార్బన్ ఫైబర్ తో తయారు చేసారు. బాహుబలి సెట్స్ కూడా ఫైబర్ తో చేసినవే.

    మళ్లీ ఉపయోగించొచ్చు

    మళ్లీ ఉపయోగించొచ్చు


    బాహుబలి సినిమా కోసం తయారు చేసిన వస్తువులు భవిష్యత్తులో ఇతర సినిమాలకు కూడా ఉపయోగించవచ్చు.

    విదేశాల నుండి

    విదేశాల నుండి


    బాహుబలి సినిమా సెట్స్ వేయడానికి విదేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకున్నారు.

    చైనా నుండి పూలు

    చైనా నుండి పూలు


    సినిమా కోసం చైనా నుండి రూ. 60 లక్షల విలువ చేసే పూలు తెప్పించారు.

    English summary
    Check out... Sabu Cyril interview about Baahubali movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X