»   » ఆ ఇద్దరికీ అవార్డులు ఖాయం: నొక్కి చెప్పిన ప్రభాస్

ఆ ఇద్దరికీ అవార్డులు ఖాయం: నొక్కి చెప్పిన ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమా ఇండియాలోనే అతిపెద్ద మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ పరంగానే కాదు... గ్రాఫిక్స్ పరంగా కూడా ఇదే అతి పెద్ద మూవీ. ఈ సినిమాకు పలు విభాగాల్లో అవార్డులు కూడా ఖాయం. ఈ విషయమై ప్రభాస్ స్పందిస్తూ తన మనసులోని మాటను బయట పెట్టారు.

చెన్నైలో బాహుబలి తమిళ ట్రైలర్ విడుదల సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ....‘ఈ సినిమాకు సంబంధించి అవార్డులు ఎవరికి వచ్చినా, రాకున్నా...ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులకు మాత్రం పురస్కారాలు లభిస్తాయి. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, విజువల్ ఎఫెక్ట్స్ టీంకు అవార్డు తప్పకుండా వస్తాయి. జాతీయ అవార్డులు గెలుచుకుంటారనే నమ్మకం ఉంది అన్నారు.

 Sabu Cyril and the Visual effects teamwill get awards: Prabhas

‘బాహుబలి' సినిమాకు సంబంధించిన బడ్జెట్ మీద ఎవరికీ సరైన క్లారిటీ లేదు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం బడ్జెట్ 200 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. తాజాగా తమిళ వెర్షన్ బాహుబలి ట్రైలర్ రిలీజ్ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజమౌళి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సూర్య చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ... బాహుబలి ఫస్ట్ పార్ట్ ఖర్చు రూ. 150 కోట్లు అయిందని.... సెకండ్ పార్టు పూర్తయే వరకు సినిమా మొత్తం బడ్జెట్ రూ. 250 కోట్లు అవుతుందని తెలిపారు. 2016లో బాహుబలి సెకండ్ పార్ట్ విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి వెల్లడించారు.

ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే అతిపెద్ద సినిమా అని చెప్పొచ్చు. ఇంత ఖర్చు ఇప్పటి వరకు ఏ సినిమాకు పెట్టలేదు. ఇంత భారీ బడ్జెట్ చూసి భారతీయ సినీప్రియులు నోరెళ్ల బెడుతున్నారు. అయితే ఇంత బడ్జెట్ పెట్టిన నిర్మాతలు అంతకు రెట్టింపు రాబట్టుకునేందుకు పక్కా ప్లానింగుతో ముందుకు సాగుతున్నారు.

బాహుబలి సినిమాకు సంబంధించి ఓ హాలీవుడ్ స్టూడియోతో రూ. 500 కోట్ల డీల్ కుదిరినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రముఖ హాలీవుడ్ సినీ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోతో రూ. 500 డీల్ కుదిరినట్లు సమాచారం. మార్కెటింగ్ కూడా భారీ ఎత్తున చేస్తున్నారు.

English summary
“Whether anyone gets awards or not, two persons are going to walk away with all honours. They are none than production-designer Sabu Cyril and the Visual effects team. These two might get National Award too”, says Prabhas.
Please Wait while comments are loading...