అన్ని కోట్ల ఓట్లు ఎలా? కౌశల్ ఆర్మీ ఏం చేసిందంటే? వెలుగులోకి సంచలన విషయాలు!
Recommended Video

బిగ్‌బాస్ తెలుగు 2 విజేతగా కౌశల్ నిలవడం అంతా ఊహించిందే. కౌశల్ ఆర్మీ చేస్తున్న హడావుడితో బిగ్‌బాస్ విన్నర్ ఆయనే అనే విషయం కొన్ని వారాల ముందే తేలిపోయింది. కౌశల్ ఆర్మీ చేసిన భారీ సోషల్ మీడియా కాంపెయిన్ ఆయన్ను విజేతగా నిలబెట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే కౌశల్‌కు దాదాపు 39 కోట్ల ఓట్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇంత భారీగా ఓటింగ్ రావడానికి కౌశల్ ఆర్మీ చేసిన ఆపరేషన్సే కారణం అని అంటున్నారు. కేవలం తెలుగు ప్రేక్షకుల నుండి మాత్రమే కాదు... తమిళం, మలయాళం బిగ్ బాస్ ప్రేక్షకుల నుండి కూడా కౌశల్‌కు ఓట్లు పడేలా చేశారట.

తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా ఆర్మీలు
బిగ్ బాస్ 2 తెలుగులో కౌశల్ విజేతగా నిలవగా... తమిళం బిగ్ బాస్2లో రిత్విక, మలయాళం బిగ్‌బాస్‌లో సబుమన్ విన్ అయ్యారు. తెలుగులో కౌశల్ ఆర్మీ ఏర్పడ్డట్లే.... మలయాళంలో సబు ఆర్మీ, తమిళంలో రిత్వికా ఆర్మీ ఏర్పడాయి. ఈ ఆర్మీల మద్దతుతోనే మూడు భాషాల్లో బిగ్ బాస్ విజేతలు నిర్ణయించబడ్డారు.

వారి నుండి కూడా కౌశల్‌కు ఓట్లు
కౌశల్‌కు భారీగా ఓటింగ్ జరిగేలా మద్దతు కూడగట్టడంలో కౌశల్ ఆర్మీ చేసిన ఆపరేషన్స్ సక్సెస్ అయ్యాయి. బిగ్‌బాస్ షో ప్రారంభం అయిన తర్వాత చిన్నగా మొదలైన కౌశల్ ఆర్మీ... వారాలు గడుస్తున్న కొద్దీ క్రమక్రమంగా పెరుగుతూ పోయింది. ప్రపంచంలో తెలుగు ప్రేక్షకుడు ఉన్న ప్రతి దేశానికి విస్తరించింది. అయితే కేవలం తెలుగు ప్రేక్షకుల నుండి మాత్రమే కాదు... తమిళం, మలయాళం నుండి కూడా కౌశల్‌కు సపోర్టుగా ఓట్లు వేయించడంలో కౌశల్ ఆర్మీ సక్సెస్ అయిందని తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు పరిశీలిస్తే స్పష్టమవుతోంది.
మద్దతు ఇచ్చి పుచ్చుకున్నారు
కౌశల్ ఆర్మీ, సబు ఆర్మీ, రిత్విక ఆర్మీలు.... ఒకరికొకరు సహాయం చేసుకున్నారని, తమ అభిమాన కంటెస్టెంట్స్ గెలిపించేందుకు మద్దతు ఇచ్చి పుచ్చుకున్నారని తెలుస్తోంది. దీంతో మూడూ భాషల్లో ఆయా ఆర్మీలు మద్దతు ఇస్తున్న కంటెస్టెంట్లకు భారీగా ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో భారీగా ప్రచారం
మీ అభిమాన కంటెస్టెంట్స్‌కు మేం ఓట్లేస్తున్నాం.. మీరు మాకేయ్యండి అని ఈ మూడు గ్రూప్‌లు సోషల్ మీడియాలో క్యాంపెన్ నిర్వహించాయి. దీంతో కౌశల్‌కు సబు ఆర్మీ, రిథ్విక ఆర్మీ నుండి భారీగా ఓట్లు పడ్డాయి. అదే విధంగా కౌశల్ ఆర్మీ కూడా సబుమన్, రిత్వికకు మద్దతుగా ఓట్లు వేశారు.

ఆర్మీలు బిగ్‌బాస్ షోలను శాసించాయా?
ఒక రకంగా చెప్పాలంటే.... తెలుగులో కౌశల్ ఆర్మీ శాసించినట్లు బిగ్ బాస్‌షో రన్ అయింది. కౌశల్‌తో పెట్టుకున్నవారంతా ఎలిమినేట్ అవుతూ బయటకు వెళ్లిపోవడానికి కారణం కూడా అదే. తమిళం, మలయాళంలో కూడా సబుమన్ ఆర్మీ, రిత్విక ఆర్మీ బిగ్‌బాస్ ఎలిమినేషన్లలో ముఖ్య భూమిక పోషించాయి.
.


Click it and Unblock the Notifications











