twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలాసార్లు సిగ్గు పడ్డాను.. తర్వాత భయం పోయింది.. సచిన్ టెండూల్కర్

    తన జీవిత కథను తెరకెక్కించాలనే ప్రతిపాదన వచ్చినపుడు చేయాలా వద్దా అని మొదట్లో ఆలోచించాను అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు.

    By Rajababu
    |

    తన జీవిత కథను తెరకెక్కించాలనే ప్రతిపాదన వచ్చినపుడు చేయాలా వద్దా అని మొదట్లో ఆలోచించాను అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ కోసం వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ నెల 26వ తేదీన విడుదల కానున్న సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ గురించి పలు విషయాలను వెల్లడించారు.

    ఫ్యాన్స్ కోసం..

    ఫ్యాన్స్ కోసం..

    నా జీవితంలోని చాలా విషయాలు ఫ్యాన్స్‌కు తెలియవు. ప్రతీ అంశం అభిమానులకు తెలిస్తే సంతోషపడుతారని భావించా. అందుకే ఈ సినిమాలో నటించాలని అనుకొన్నాను. సచిన్ బయోపిక్ చూసిన తర్వాత అభిమానులు థ్రిల్ అవుతారు. నా జీవితంలో దాచింది ఏమిలేదు అని సచిన్ అన్నారు.

    కెమెరా ముందు ఇబ్బంది..

    కెమెరా ముందు ఇబ్బంది..

    సచిన్ సినిమా ప్రారంభమైనప్పుడు కెమెరా ముందు ఇబ్బంది పడ్డాను. కెమెరా ముందు చాలాసార్లు సిగ్గు పడాల్సి వచ్చింది. కొద్దిరోజుల్లో కెమెరా భయం పోయింది. రీల్ లైఫ్ కన్నా రీల్ లైఫ్ చాలా పెద్దది
    సినిమా రంగానికి సంబంధించి నాకు సెకండ్ ఇన్సింగ్స్ లేదు అని చెప్పారు.

    రెహ్మాన్ హెల్ప్ అయ్యాడు..

    రెహ్మాన్ హెల్ప్ అయ్యాడు..

    సచిన్ బయోపిక్‌కు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ బాగా హెల్ప్ అయ్యాడు. రెహ్మాన్ నాకు మంచి మిత్రుడు. మా ఇద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది అని మాస్టర్ బ్లాస్టర్ పేర్కొన్నారు. సచిన్ బయోపిక్‌కు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

    హైదరాబాద్ బిర్యానీ అంటే..

    హైదరాబాద్ బిర్యానీ అంటే..

    హైదరాబాద్‌లో ఎండలు బాగా ఉన్నాయి. కానీ అభిమానుల ప్రేమ వల్ల ఎక్కువ చల్లదనం లభిస్తుంది. హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టం. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఇక్కడ నాకు ఎన్నో మధుర అనుభవాలు ఉన్నాయి అని సచిన్ తెలిపారు.

    సైనిక దళాల అధికారులకు ప్రివ్యూ

    సైనిక దళాల అధికారులకు ప్రివ్యూ

    సచిన్ బయోపిక్‌ను శుక్రవారం న్యూఢిల్లీలో భారత సైనిక దళాల అధికారులకు ప్రత్యేక షో వేసి చూపించారు. ఈ కార్యక్రమానికి సచిన్ తన భార్య అంజలితో కలిసి హాజరయ్యారు. ఎయిర్ ఫోర్స్ డ్రస్సు ధరించిన రావడం గమనార్హం. సినిమా ప్రదర్శన ముగిసిన తర్వాత హాలులోని ప్రతీ ఒక్కరు లేచి కరతాళ ధ్వనులతో హాలును దదరిల్లేలా చేశారు.

    English summary
    Master blaster Sachin Tendulkar's biopic Sachin: A Billion dreams is going to release on May 26. In this occassion he shares brilliant moments of his life. At the special screening of ‘Sachin: A Billion Dreams’, Honorary Group Captain Sachin Tendulkar was joined by Air Chief Marshal BS Dhanoa along with personnel and their families from Indian Air Force, Indian Army and Indian Navy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X