తుపాను బాధితులకు హీరో సచిన్ 15 లక్షల విరాళం
హైదరాబాద్: ఇటీవల తెలుగులో విడుదలైన నీ జతగా నేనుండాలి చిత్రంలో నటించిన హీరో సచిన్ జోషి తుఫాన్ బాధితుల్ని ఆదుకునేందుకు తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తనను ఆమితంగా అభిమానించే తెలుగు వారికి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం అన్నారు.
తుపాను రూపంలో వచ్చిన ఇలాంటి విపత్కర పరిస్థితిని మీడియాలో చూసి తట్టుకోలేకపోయానని ఆయన అన్నారు. హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం 15 లక్షల విరాళాన్ని ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఉత్తారాంధ్ర ప్రాంతాలు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.



Click it and Unblock the Notifications











