ఎన్టీఆర్ బయోపిక్‌లో అత్యంత కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు!
ఎన్టీఆర్ బయోపిక్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రానికి మొదటగా అనుకున్న దర్శకుడు తేజ తప్పుకోవడం, అతడి స్థానంలో క్రిష్ జాగర్లమూడి రావడంతో సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యం అవుతోంది. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం కోసం భారీ తరగణాన్ని తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జీవితం సినీ, రాజకీయంతో మిళితమైంది.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకా అనేక కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు పాత్ర ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కీలకమైనది. నాదెండ్ల భాస్కర రావు పాత్ర కోసం దర్శకుడు క్రిష్ బాలీవుడ్ నటుడు సచిన్ కడేకర్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఈ పాత్ర చేయడానికి ఆయన అంగీకరించారని సమాచారం. వీలైనంత త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారు. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటించబోతున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications











