బ్యాట్ పట్టిన ప్రతి ఒక్కడూ సచిన్ కాదు...(ఫోటోస్)
హైదరాబాద్: సీనియర్ నటి సుహాసిని, మాజీ క్రికెటర్ వెంకటేష్‌ప్రసాద్, మాస్టర్ స్నేహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సచిన్. టెండూల్కర్ కాదు అనేది చిత్ర ఉపశీర్షిక. తానికొండ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.మోహన్ దర్శకుడు. రాజేష్ రామ్‌నాధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర ఆడియో విడుదలైంది.
ఈ చిత్రానికి సంబంధించిన పాటలు హైదరాబాద్ దాసరి నారాయణరావు స్వగృహంలో విడుదలయ్యాయి. తొలి ప్రతిని మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు స్వీకరించారు. దాసరి నారాయణరావు తొలి సీడీని విడుదల చేసి క్రికెట్ ప్లేయర్ వెంకటపతిరాజుకు అందజేశారు.
సచిన్ ఓ ప్రయోగాత్మక చిత్రంగా కాకుండా కమర్షియల్ విలువలతోకూడా రూపొందించారని, తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని దాసరి నారాయణరావు అన్నారు. స్లైడ్ షోలో ఫోటోలు...

ప్రతి వాడూ సచిన్ కాదు
ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ క్రికెట్ బ్యాట్ పట్టిన ప్రతి ఒక్కరు టెండూల్కర్ కాదు అనే అంశాన్ని ఈ చిత్రంలో చక్కగా చూపించారని దాసరి అన్నారు.

సమాజానికి ఉపయోగం
కేవలం కమర్షియల్ సినిమాలా కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి సందేశంతో రూపొందిన చిత్రమిది.

దాసరి గురించి
వెంకటపతిరాజు మాట్లాడుతూ దాసరి నారాయణరావు, నేను పక్కపక్క ఊళ్ల వాళ్లమే. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

విడుదల
నిర్మాత మాట్లాడుతూ క్రికెట్‌పై ప్రేమ ఉన్న ఓ బాలుడి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం సుహాసిని, వెంకటేష్ ప్రసాద్ పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.


Click it and Unblock the Notifications