ఈ పాట వింటే సచిన్ ఫ్యాన్స్ రొమాలు నిక్కబొడుస్తాయి!
ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ బయోపిక్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా సచిన్ సచిన్ సాంగ్ రిలీజ్ చేసారు.
హైదరాబాద్: ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ బయోపిక్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా సచిన్ సచిన్ సాంగ్ రిలీజ్ చేసారు.
ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ పాటను సుఖ్విందర్ సింగ్ పాడారు. 'సచిన్ సచిన్' అంటూ మొదలయ్యే ఈ పాట విన్న అభిమానుల రొమాలు నిక్కబోడిచేలా కంపోజ్ చేసారు. సినిమాకు ఈ పాటే హైలెట్ అవుతుందని అంటున్నారు.
'సచిన్ : ది బిలియన్ డ్రీమ్స్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవిత కధ ఆధారం గా జేమ్స్ ఎరిక్సన్ దర్శకత్వం తెరకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో తన పాత్రలో సచినే స్వయంగా నటించడం విశేషం.
కొన్ని రోజుల క్రితం సచిన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ' ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఇదిగో. మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి, డేట్ సేవ్ చేసుకోండి' అంటూ 26.05.17న సినిమా రిలీజ్ అవుతుంది' అని ట్వీట్ చేసారు.


Click it and Unblock the Notifications











