800 Movie మురళీధరన్‌కు ఎదురైన చేదు అనుభవాలు ప్రజలకి తెలియాలి.. ఆయన కష్టాలు నాకు తెలుసు: సచిన్ టెండూల్కర్
అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలన విజయాలు సాధించిన స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా 800 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా వేడుక ముంబైలో సెప్టెంబర్ 5వ తేదీన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో మాస్టర్ బ్లాస్టర్, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో క్రికెటర్ సనత్ జయసూర్య, '800' చిత్ర నిర్మాత వివేక్ రంగాచారి, మహిమా నంబియార్, యుఎఫ్ఓ మూవీస్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ...
ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమాను ఎంఎస్ శ్రీపతి తెరకెక్కిస్తున్నారు. ముత్తయ్య మురళీధరన్ పాత్రను స్లమ్ డాగ్ మిలియనర్ ఫేమ్ మధుర్ మిట్టల్, ఆయన భార్య పాత్రను ముధిమలార్ రామస్వామి పోషిస్తున్నారు. ఈ సినిమాకు బుకర్ ప్రైజ్ విన్నర్ స్నేహన్ కరుణాతిలక రైటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందిన 800 సినిమాను ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ పాన్ ఇండియా డిస్టిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకొన్నాడు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడమే కాకుండా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తన్నాడు. ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలో డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ చేస్తున్నారు.

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 చిత్రం ట్రైలర్ భావోద్వేగంతో సాగింది. బాల్యం నుంచే మురళీధరన్‌ను వెంటాడిన చేదు అనుభవాలు గుండెను మెలిపెట్టే విధంగా ఉంటాయి. అలాగే శ్రీలంకలో తమిళులతో వివక్ష, బానిసతత్వం గుండెలో ఆవేదనను రగలించేలా ఉంది. ఇక క్రికెట్‌లో చెకింగ్ ఆరోపణలు వచ్చిన తర్వాత ముళీధరన్ అనుభవించిన ఉద్విగ్న భరిత సంఘటనలు ప్రతీ ఒక్కరిని కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఈ ట్రైలర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తున్నది.
800 ఆవిష్కరణలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ .. మై వెరీ డియర్ ఫ్రెండ్ మురళీధరన్ కి ఆల్ ది బెస్ట్. అతని జీవితంలో జరిగిన సంఘటనలు, అతడు అనుభవించిన ఆవేదన గురించి అన్ని దేశాల ప్రజలు తెలుసుకోవాలి. నేను 1993లో తొలిసారి మురళీధరన్‌ను కలిశాను. అప్పటి నుంచి మా మధ్య మొదలైన స్నేహం అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నది. గత నెల యూనిసెఫ్ పని మీద శ్రీలంకలో పర్యటించాను. ఆ సందర్భంగా అప్పుడు నేను మీ సిటీలో ఉన్నానని మురళీధరన్‌కు మెసేజ్ చేశా అని తెలిపారు.

శ్రీలంకకు వెళ్లి మెసేజ్ చేస్తే.. అక్కడ ఏం చేస్తున్నావ్. నేను భారత్ లో ఉన్నాను అని మురళీధరన్ నాకు రిప్లై ఇచ్చాడు. తర్వాత తన బయోపిక్ 800 మూవీ గురించి చెప్పాడు. ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంది. మీరు రాగలరా? అని మురళీధరన్ అడిగాడు. దాంతో వెంటనే ఒప్పుకొన్నాను. క్రికెట్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మురళీధరన్ ఎంతో సాధించాడు. అయినా చాలా సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. అతడు ఏదైనా అడిగితే కాదు.. లేదు అని చెప్పడం కష్టం. మురళీధరన్ కోసమే నేను ఇక్కడికి వచ్చా అని సచిన్ టెండూల్కర్ అన్నాడు.
శ్రీపతి నా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. మేం చేసిన సరోజ 15 ఏళ్ళ క్రితం ఇదే రోజున విడుదలైంది. శ్రీపతి కోసం ఈ రోజు నేను, పా రంజిత్ ఈ వేదికపై ఉండటం సంతోషంగా ఉంది. మురళీధరన్ భార్య మదిమలర్ నా బాల్య స్నేహితురాలు. అసలు ఈ సినిమాను నేను డైరెక్ట్ చేయాలి. అయితే, శ్రీపతి నాకంటే బాగా తీశాడు. మురళీధరన్ గారికి శ్రీపతిని నేనే ఇంట్రడ్యూస్ చేశా అని వెంకట్ ప్రభు అన్నారు. దర్శకులు పా రంజిత్ మాట్లాడుతూ.. ఒకవేళ మురళీధరన్ చెన్నైలో జన్మించి ఉంటే మన దేశం తరఫున ఆడేవారు అంటూ పా రంజిత్ ఎమోషనల్ అయ్యారు. లెజెండరీ క్రికెటర్, స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటించడం ఓ బాధ్యత. ఆ అవకాశం నాకు వచ్చిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. మా కెప్టెన్ శ్రీపతి గారు ఇచ్చిన సూచనలను ఫాలో అయ్యాను అని మధుర్ మిట్టల్ అన్నారు.


Click it and Unblock the Notifications











