»   »  సచిన్ అండ్ బాలీవుడ్ (ఫోటో ఫీచర్)

సచిన్ అండ్ బాలీవుడ్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఇండియన్ క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడై బై చెబుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సచిన్ నిర్ణయంతో దేశంలోని ఆయన అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సచిన్ అభిమానులైన పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా తమ నిరాశను వ్యక్తం చేసారు.

మన దేశంలో క్రికెట్‌ను ఒక మతంలా భావిస్తారు అభిమానులు. సచిన్ వచ్చిన తర్వాత ఇండియన్ క్రికెట్‌కు సరికొత్త శోభ వచ్చిందనే చెప్పొచ్చు. సచిన్ లేకుండా ఇండియన్ క్రికెట్ టీంను ఊహించడం కష్టం అనే విధంగా పరిస్థితి తయారైంది. ఆయన్ను క్రికెట్ దేవుడుగా కొలవడం మొదలు పెట్టారు. అందుకే సచిన్ రిటైర్ అవుతున్నారంటే అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు భావిస్తున్నారు.

పలువురు బాలీవుడ్ స్టార్‌కి సచిన్‌తో ఎంతో మంచి అనుబంధం ఉంది. వారిలో కొందరు సచిన్‌తో కలిసి వాణిజ్య ప్రకటనల్లో నటించారు. బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌లు సచిన్‌తో కలిసి పెప్సీ యాడ్లో నటించారు. అప్పటి నుంచి వీరితో సచిన్ అనుబంధం మరింత గట్టిపడిందని చెబుతారు.

అదే విధంగా ప్రముఖ నటుడు అమీర్ ఖాన్‌కు కూడా సచిన్ మంచి స్నేహితుడు. అమీర్ ఖాన్ రెండో పెళ్లికి సచిన్ పర్సనల్‌గా హాజరయ్యారు కూడా. సచిన్ ఫేవరెట్ సింగర్ కిషోర్ కుమార్. అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్‌ల నటన అంటే సచిన్‌కి చాలా ఇష్టం. 2003లో వచ్చిన బాలీవుడ్ మూవీ 'స్టంప్డ్'లో కూడా సచిన్ గెస్ట్ పాత్రలో నటించారు. సచిన్ రిటైర్మెంట్ నిర్ణయంపై బాలీవుడ్ స్టార్ ఎవరు ఎలా స్పందించారనే విషయం స్లైడ్ షోలో చూద్దాం...

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్

అడిక్షన్ అంటే ఎలా ఉంటుందో సచిన్‌ను చూసిన తర్వాతే నాకు అర్థం అయింది. సచిన్ లేని క్రికెట్‌ను ఊహించలేను. సచిన్ లేకుండా క్రిరెట్ నాకు సహింపదు అని ట్వీట్ చేసారు షారుక్.

వివేక్ ఒబెరాయ్

వివేక్ ఒబెరాయ్

సచిన్ ఎంతో గొప్ప ఆటగాడు. ఆయన వన్డేలు ఆడుతుంటే చూడటం నాకు ఎంతో ఇష్టం. ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరం అవుతుండటం నన్ను నిరాశ పరుస్తోందని వివేక్ ఒబెరాయ్ వ్యాఖ్యానించారు.

రితేష్ దేశ్ ముఖ్

రితేష్ దేశ్ ముఖ్

సచిన్ ఇండియన్ క్రికెట్‌కు చేసిన సేవ మరువలేనిది. ఆయన ప్రతిభకు నేను సెల్యూట్ చేస్తున్నాను. అలాంటి గొప్ప ఆటగాడు రిటైర్ అవ్వడం అంటే నిరాశ పరిచే విషయమే...అని రితేష్ దేశ్ ముఖ్ వ్యాఖ్యానించారు.

దియా మీర్జా

దియా మీర్జా

సచిన్ ఎంతో గొప్ప ఆటగాడు. అభిమానుల గుండెల్లో ఆయన స్థానం శాశ్వతం. క్రికెట్‌తో ఆయన కోట్లాది మందిని సంతోష పరిచారు. ఆయనకు కృతజ్ఞతలు అని దియా మీర్జా వ్యాఖ్యానించారు.

శేఖర్ కపూర్

శేఖర్ కపూర్


క్రికెట్ ప్రపంచానికి ఆయన దేవుడు. ఆయనకు గొప్ప శక్తి ఉంది. ఆయన టాలెంట్ అమోఘం. ఆయన సేవాగుణం అభినందనీయం అని శేఖర్ కపూర్ వ్యాఖ్యానించారు.

రాహుల్ బోస్

రాహుల్ బోస్


సచిన్ లాంటి గొప్ప ఆటగాడు రిటైర్మెంట్ తీసుకోవడం అభిమానులకు సహింపదు. ఆయన లాంటి ఆటగాన్ని మల్లీ చూస్తామో లేదో? అని వ్యాక్యానించారు.

కునాల్ కోహ్లి

కునాల్ కోహ్లి


సచిన్‌ను ఎలా పిలవాలో తెలుసా.....Sachinnnnn .... #Sachin !!!! Sachiiiin .... Sachin!!!!

పూనమ్ పాండే

పూనమ్ పాండే


నేను పుట్టకముందు నుంచే సచిన్ ఇండియా కోసం బ్యాట్ పట్టాడు. ఆయన ఒక గ్రేట్ లెజెండ్. శాల్యూట్ చేస్తున్నా అని వ్యాఖ్యానించింది.

మందిరా బేడీ

మందిరా బేడీ


సచిన్ ఉన్న రోజులు క్రికెట్ ఎంతో గొప్పగా ఉంది. ఆయన రిటైర్మెంట్ ప్రకటన చేసారు. ఇది నిజంగా ఒక శకం ముగిసిందనడానికి గుర్తు...అని వ్యాఖ్యానించారు.

సోఫీ చౌదరి

సోఫీ చౌదరి


సచిన్ భారత దేశం గర్వించ దగిన వ్యక్తి. గొప్ప ఆటగాడు మాత్రమే కాదు...సేవానిరతి ఉన్న వ్యక్తి...అని సోఫీ చౌదరి వ్యాఖ్యానించింది.

షాహిద్ కపూర్

షాహిద్ కపూర్


ఆయన లాంటి గొప్ప స్పోర్ట్స్‌మేన్ ఇండియాలో ఇక ముందు పుట్టరేమో, ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కష్టం...అని షాహిద్ కపూర్ వ్యాఖ్యానించారు.

వివేక్ అగ్నిహోత్రి

వివేక్ అగ్నిహోత్రి


అందరికీ హెచ్చరిక...సచిన్ ఆడే 200వ టెస్టు రోజు సినిమా విడుదల చేయడం అంటే రిస్క్ చయడమే....అని వ్యాఖ్యానించారు.

English summary
Sachin Tendulkar has announced his retirement from International cricket and the whole country is in a shock. Sachin's decision to bid adieu to cricket after his 200th test match has left everyone around the world heartbroken.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu