పివిపి సినిమా కాంప్లెక్స్ ప్రారంభించనున్న సచిన్ (ఫోటోలు)

By Bojja Kumar

విజయవాడ్: తెలుగు, తమిళ భాషల్లో భారీ చిత్రాలు నిర్మిస్తూ అనతి కాలంలోనే అగ్ర నిర్మాతగా మారిన పి.వి.పి సంస్థ అధినేత ప్రసాద్ వి. పొట్లూరి..నిర్మాతగానే కాకుండా వ్యాపార వేత్తగానూ తన దక్షతను ఘనంగా చాటుకుంటూ ఆ రంగంలోనూ విజయబావుటా ఎగురవేస్తున్నారు.

క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన ప్రసాద్ వి.పొట్లూరి 'ఐబిఎల్-ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్'లో ప్రాంచైజీ ఓనర్‌గా ఉన్నారు. ఆయన ఫ్రాంచైజీ ఓనర్‌గా ఉన్న 'హైదరాబాద్ హాట్ షాట్స్' జట్టు సైనా నెహ్వాల్ నేతృత్వంలో 2013 ఐబిఎల్ ట్రోపీ గెలుచుకుంది. అలాగే దీంతో పాటు పివిపి 'ది గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్ భాగస్వామ్యంతో ఇండియన్ సాకర్ లీగ్ లోకి అడుగిడిన విషయం తెలిసిందే.

స్లైడ్ షోలో పివిపి స్వ్కేర్‌కు సంబంధించిన వివరాలు ఫోటోలు...

పివిపి స్వ్కేర్

పివిపి స్వ్కేర్

ప్రసాద్ వి పొట్లూరి విజయవాడలో ‘పివిపి స్వ్కేర్' పేరుతో ఓ కాంప్లెక్స్ నిర్మించారు.

అత్యాధునిక సొగబులు

అత్యాధునిక సొగబులు

ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న మాల్స్ -కాంప్లెక్స్ లను తలదన్నేలా అత్యాధునిక సౌకర్యాలతో నవతరం సొగబులతో పాటు సాంప్రదాబద్దమైన వ్యవస్థీకరణతో రూపుదిద్దుకున్న ‘పివిపి స్వేర్'ను ఆగస్టు 1న ప్రారంభించనున్నారు.

సచిన్

సచిన్

అత్యంత ఘనంగా నిర్వహించనున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విచ్చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.

ప్రసాద్ వి పొట్లూరి

ప్రసాద్ వి పొట్లూరి

కొత్తగా ఏర్పడుతున్న నవ్యాంధ్రప్రదేశ్ కు పివిపి స్వ్కేర్ ఓ రాజమకుటంలా ఉండబోతోందని, త్వరలోనే ఇండస్ట్రియల్ క్యాపిటల్‌గా రూపాంతరం చెందనున్న విజయవాడకు పివిపి స్వ్కేర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పి.వి.పి బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X