Just In
- 5 min ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 37 min ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 1 hr ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 3 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
Don't Miss!
- News
ఏపీలో టెన్షన్, టెన్షన్- మొదలుకాని నామినేషన్లు- ఎస్ఈసీ ఆఫీసులోనే నిమ్మగడ్డ
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Finance
భారీ లాభాల నుండి, భారీ నష్టాల్లోకి: రిలయన్స్ మహా పతనం
- Lifestyle
జనన నియంత్రణ ఉన్నప్పటికీ గర్భం వచ్చే ప్రమాదం
- Automobiles
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘సచిన్! టెండూల్కర్ కాదు’ రిలీజ్ డేట్
హైదరాబాద్: భారతదేశ క్రికెట్ రంగంలో గర్వించదగ్గ ఆటగాడు వెంకటేష్ ప్రసాద్ మెట్టమెదటి సారిగా నటుడిగా వెండితెరపై నటించిన చిత్రం ‘సచిన్'. ‘టెండూల్కర్ కాదు' అనేది ఉప శీర్షిక. ప్రముఖ సీనియర్ నటి సుహసిని మణిరత్నం కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. సుభాష్ ప్రోడక్షన్స్ పతాకంపై, తాయికొండ వెంకటేష్ నిర్మాతగా, ఎస్.మోహన్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం కన్నడలో ఇటీవలే విడుదలయ్యి విమర్శకుల ప్రశంశలతో పాటు, ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. తెలుగులో దర్శకరత్న దాసరి నారాయణ గారి చేతుల మీదుగా ఇటీవలే ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో విడుదలయ్యి మంచి సక్సస్ సాధించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 20 న తెలుగు లొ విడుదల చేస్తున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సందర్భంగా నిర్మాత తాయికొండ వెంకటేష్ మాట్లాడుతూ.. భారతదేశ క్రికెట్ రంగంలో గర్వించదగ్గ ఆటగాడు వెంకటేష్ ప్రసాద్ మెట్టమెదటి సారిగా నటుడిగా వెండితెరపై నటించిన చిత్రం సచిన్- టెండూల్కర్ కాదు. ప్రముఖసీనియర్ నటి సుహసిని మణిరత్నం కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. సుహసిని గారు చాలా రోజుల తరువాత పాత్ర నచ్చి అద్బుతంగా చేశారు. సుహసిని గారు లేకపోతే ఈ సినిమానే లేదు. కొన్ని సన్నివేశాల్లో కంట తడి పెట్టిస్తారు. సుహసిని గారు నటించిన అమ్మ లాంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రం మల్లి అందరికీ గుర్తోచ్చేలా ఈ చిత్రం వుందని చూసినివారు చెబుతున్నారు. ఈ చిత్రం తో సుహసిని గారు అవార్డు గెలవటం ఖాయం. క్రికెటర్ గా యావత్ ప్రపంచాన్ని అలరించిన వెంకటేష్ ప్రసాద్ గారు ఈ చిత్రంలో క్రికెట్ కోచ్ గా నటించారు. ఆయన మెదటి చిత్రంలో నటిస్తున్న ఫీలింగ్ అసలు రాదు. అంత బాగా నటించారు. ఎస్.మోహన్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం కన్నడలో ఇటీవలే విడుదలయ్యి విమర్శకుల ప్రశంశలతో పాటు, ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. మంచి కథతో, అంతే మంచి కథనంతో చివరి అరగంటలో ఆధ్యంతం ఉత్కంఠ గా సాగే కథనం ఆకట్టుకుంటుంది. మానవత్వం ఇంకా బ్రతికేవుంది అది బయటకి తీస్తే సాటి వారిని మనిషిగా గుర్తిస్తాం. పక్కవాడి కష్టానికి సహయం చేసే మంచి హ్రుదయం అందరికి వుంటుంది. అది బయట పెడితే ప్రతిఓక్కరూ ఆనందంగా వుంటారు అనే చక్కటి మంచి సందేశాన్ని అందించారు. దర్శకరత్న దాసరినారాయణ గారి చేతుల మీదుగా ఇటీవలే ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో విడుదల చేసి వెంకటపతి రాజు కి అందించగా, ఆడియో మంచి సక్సస్ సాధించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 20 న తెలుగు లొ విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రముఖ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్, ప్రముఖ నటి సుహసిని మణిరత్నం, స్నేహిత్, సుభాషిణి తదితరులు నటించగా.. సంగీతం- రాజేష్ రామ్‌నాథ్, , కెమెరా- డి. ప్రసాద్ బాబు, ఎడిటింగ్- శివ్, నిర్మాత- తాయికొండ వెంకటేష్, కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం- ఎస్.మెహన్.