సచిన్ టెండూల్కర్ బాలీవుడ్ ఎంట్రీ..?
శత శతకవీరుడు సచిన్ టెండూల్కర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఇన్నాళ్లు మైదానంలో వినోదాన్ని పంచిన మాస్టర్ బ్లాస్టర్ త్వరలో వెండితెరపై ఎంటర్‌టైన్ చేయనున్నారా?..... బాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ వార్తలు నిజమే అని నమ్మక తప్పడం లేదు. బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా రూపొందిస్తున్న 'ఫెరారికి సవారి' చిత్రం ద్వారా సచిన్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది. క్రికెట్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సచిన్ కోసం దర్శకుడు ప్రత్యేకంగా ఓ పాత్రను సృష్టించాడని, సచిన్ హుందాతనానికి, గొప్పతదానికి ఏమాత్రం తీసిపోకుండా ఆ పాత్ర ఉంటుందని తెలుస్తోంది.
సచిన్ 100వ వంద చేసిన సందర్భంగా ఇటీవల ముఖేష్, నీతా అంబానీలు ఏర్పాటు చేసిన బాష్‌లో విధు వినోద్ చోప్రా సచిన్‌తో ప్రత్యేకంగా మాట్లాడాడు. తన సినిమాలో సచిన్‌ను ఒప్పించడంలో భాగంగానే విధు ఆయనతో మాట్లాడారని దర్శకుడి సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. అదే జరిగితే అభిమానులకు పండగే ఇక.


Click it and Unblock the Notifications












