లావణ్యకు నాతో ప్రెగ్నెన్సీ, తమన్నాతో బ్రేకప్.. కామెంట్లు చేసిన సాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ అరెస్ట్
కొద్దికాలంగా యూట్యూబ్‌లో వివాదాస్పద ఇంటర్వ్యూలు చేస్తూ గందరగోళానికి కారణమవుతున్న సాక్రిఫైజ్ స్టార్ శ్రీరామోజు సునిశిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజులుగా తమన్నా భాటియా, లావణ్య త్రిపాఠి, సుకుమార్ లాంటి సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కొందరు చేసిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని సునిశిత్‌ను అరెస్ట్ చేశామని కీసర ఇన్స్‌పెక్టర్ నరేందర్ మీడియాకు తెలిపారు. సునిశిత్ అరెస్ట్‌కు అసలు కారణం ఏమిటంటే..
Recommended Video

నా వల్ల లావణ్య త్రిపాఠికి గర్బం
సాక్రిఫైజ్ స్టార్‌గా పిలువబడుతున్న శ్రీరామోజు సునిశిత్ కొద్ది రోజులుగా సినీ తారలు తమన్నా భాటియా, లావణ్య త్రిపాఠిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తమన్నాతో నాకు అఫైర్ ఉంది. చాలా రోజులు డేటింగ్ చేసిన తర్వాత వ్యక్తిగత అభిప్రాయబేధాలు వచ్చాయి. అందుకే మేము విడిపోయాం అంటూ సునిశిత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

లావణ్య త్రిపాఠికి మూడుసార్లు గర్బం
అలాగే సినీ తార లావణ్య త్రిపాఠిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. లావణ్య త్రిపాఠితో నాకు పెళ్లి అయింది. నా ద్వారా ఆమెకు మూడుసార్లు గర్బం వచ్చింది. ఆ తర్వాత ఆమె అబార్షన్ చేసుకొన్నది. ఆ విషయంలో గొడవ జరిగి మేము విడిపోయాం అంటూ సునిశిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు
తమన్నా, లావణ్య త్రిపాఠిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ.. పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పోలీసులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, వాటిని పోలీసు డిపార్ట్‌మెంట్ తీవ్రంగా పరిగణించి సునిశిత్‌ను కీసర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌పై కోర్టుకు తరలించారు.

తారలపై వివాదస్పద వ్యాఖ్యలు
సునిశిత్ అరెస్ట్‌పై కీసర ఇన్స్‌పెక్టర్ నరేందర్ మీడియాతో మాట్లాడుతూ.. సునిశిత్ అనే వ్యక్తి యాక్టర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, సీబీఐలో ఇన్వెస్టిగేటర్‌గా, ఏసీబీలో పనిచేసినట్టు చెప్పుకొంటూ పబ్బం గడుపుతున్నాడు. సినీ తారలు, ప్రముఖుల గురించి అవాస్తవాలు చెబుతూ యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి ప్రచారం చేసే విషయంపై ఫిర్యాదు మాకు అందాయి అని ఇన్స్‌పెక్టర్ నరేందర్ తెలిపారు.

తప్పని తెలిసినా ప్రోత్సాహం
సునిశిత్ తప్పుడు సమాచారం ఇస్తున్నారనే విషయం కూడా తెలిసి యూట్యూబ్ ఛానెల్స్ వారు ఆయనను ప్రోత్సహించారు. రేటింగ్స్, వ్యూవర్ షిప్ కోసం మీడియా సపోర్ట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. త్వరలోనే యూట్యూబ్ ఛానెల్స్‌కు నోటీసులు పంపిస్తాం. అలాగే మహిళలను వేధించారనే ఆరోపణలపై ఇబ్రహీంపట్నంలో కేసులు నమోదయ్యాయి.

ఎంటెక్ చదువుకొని.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా
సునిశిత్ అరెస్ట్‌కు ఇన్స్‌పెక్టర్ నరేందర్ కారణం చెబుతూ జూన్ 12వ తేదీన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో పోలీసులపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. దానిపై ఫిర్యాదు రావడంతో అరెస్ట్ చేశాం. అతడిని విచారించగా.. ఎంటెక్ చదువుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సినిమాలపై మోజు, ఆసక్తి ఉండి.. పబ్లిసిటీ కోసం పాకులాడుతూ పలువురు సినీ తారలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని కేసు నమోదు చేశాం. రిమాండ్‌పై కోర్టుకు తరలించాం అని చెప్పారు.


Click it and Unblock the Notifications











